సావర్కర్ పై తప్పుడు కథనాలకు క్షమాపణలు కోరిన ది వీక్ మ్యాగజైన్

0
781

ప్రఖర జాతీయవాదులైన స్వాతంత్ర్య సమరయోధులను అవమానించడం, వారిని ఎగతాళీ చేయడం, వారిపై అభూతల్పనలు ప్రచారం చేయడం, తప్పుడు కథనాలను ప్రచురించి… దేశ ప్రజల్లో వారిపట్ల నెలకొని ఉన్న ఆరాధన భావనను చులకన చేయడం, మన దేశంలోని లెప్ట్ లిబరల్ లుటియెన్స్ మీడియాకు బాగా అలవాటు.! ఎందుకంటే మేము రాసిందే నిజం..! మేము చెప్పిందే జనం నమ్ముతారని వీరి భావన..! అయితే ఇప్పుడు రోజులు మారాయి.! ఈ లెఫ్ట్ లిబరల్ లుటియెన్స్ జర్నలిస్టులు చేసే తప్పుడు  ప్రచారాలపై లీగల్ గా ఫైట్ చేస్తే తప్పక కాళ్ల బేరానికి వస్తారు.! అందుకు కేరళకు చెందిన మళయాల మనోరమ నడిపే ది వీక్ ఇంగ్లీష్ మ్యాగజైనే ఒక ఉదాహరణ.!

వీరసావర్కర్ ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు. అలాగే హిందూ సాంస్కృతిక జాతీయవాదిగా కూడా ఆయనకు పేరు.!  స్వాతంత్ర్య సమరయోధుడు సరే..! కానీ హిందుత్వవాద రాజకీయాలకు తాను బ్రతికి ఉన్నంతకాలం సిద్ధాంతపరమైన భూమికను రూపొందించండలో కీలక పాత్ర పోషించారు సావర్కర్.!  ఇక్కడే ఆయనంటే కమ్యూనిస్టులకు, లుటియెన్స్ జర్నలిస్టులకు, ఇంకా కుహానా చరిత్రకారులకు కడుపుమంట! వారు తమ ఈ కడుపుమంటను అవకాశం దొరికినప్పుడల్లా, తమకు తాబేదారులుగా వ్యవహారించే పత్రికల్లో వ్యాసాలును ప్రచురిస్తూనే  ఉంటారు.అలాంటి పత్రికల్లో కేరళ నుంచి పబ్లిష్ అయ్యే ది వీక్ మ్యాగజైన్ కూడా ఒకటనే ఆరోపణలు ఉన్నాయి.

2016 జనవరి 24వ తేదీన ది వీక్ మ్యాగజైన్ వీరసావర్కర్ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా తప్పుడు తర్కాలతో అనేక అభియోగాలను మోపింది. సావర్కర్ వీరుడు కాదని.. కానీ అతన్ని సింహానికి ప్రతికగా చూపేట్టుందుకు., కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందనే అర్థం వచ్చేరీతిలో కవర్ పేజీ స్టోరీని ది వీక్ ప్రచురించింది. ఈ కవర్ స్టోరీని నిరంజన్ తక్లే అనే ఒక లుటియెన్స్ జర్నలిస్టు రాశాడు.

1911లో మహారాష్ట్ర ప్రాంతంలోనే కాకుండా, అటు బ్రిటన్ లో సైతం ఆంగ్లేయ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారతీయ యువకులందరినీ స్వాతంత్ర్య పోరాటానికి మోటివెట్ చేస్తున్నారనే అభియోగాలతో వీరసావర్కర్ ను బ్రిటిష్ ప్రభుత్వం అరెస్టు చేసి రెండు జీవిత ఖైదులు విధించింది. రెండు జీవిత ఖైదులంటే 50 ఏళ్లు!

1911లో అండమాన్ జైలులో అడుగుపెట్టేనాటినికి సావర్కర్ వయస్సు కేవలం 28 ఏళ్ళు మాత్రమే.! అయితే సావర్కర్ బ్రిటిష్ ప్రభుత్వానికి లొంగిపోయి తర్వాత క్షమాపణలు చెప్పాడని, ఇలా మరే భారతీయ స్వాతంత్ర్య సమరయోధులు చేయలేదని షంసూల్ ఇస్లామ్ అనే ఓ చరిత్రకారుడు కోట్ చేశాడని నిరంజన్ తక్లే తన వ్యాసంలో చెప్పుకొచ్చాడు. అంతేకాదు గాంధీజీ హత్యలో సైతం సావర్కర్ ప్రేమయం ఉందని కూడా తక్లే తన కథనంలో పేర్కొన్నాడు.

నిజానికి వీర సావర్కర్ అండమాన్ జైలులో ఎన్నో నరకయాతనలు అనుభవించాడు. జైలులో ప్రవేశించిన తర్వాత ఆరు నెలలు ఆయన ఏకాంత ఖైదులోనే గడిపారు. మెడచూట్టు పెద్ద రింగుతో కూడిన సంకేళ్లు.. కనీసం కూర్చోవడానికి అవకాశం లేకుండా రెండు కాళ్లకు సైతం నిలువు రాండ్ తో కూడిన బేడీలు. ఇలా నెలలపాటు గడిపారు సావర్కర్. అలాగే అనేకవారాల పాటు చీకటి గదుల్లో శిక్షను అనుభవించారు. నూనె గానుగాను తిప్పాడు. అనేక సార్లు ఎదురు తిరిగి కొరడా దెబ్బలు తిన్నారు. అదే అండమాన్ జైలులో తన సొంత అన్నయ్య కూడా శిక్షను అనుభవిస్తున్నాడనే విషయం ఏడాది తర్వాత కానీ సావర్కర్ తెలియదు. దాదాపు పదేళ్లపాటు సావర్కర్ అండమాన్ జైలులో అనేక నరకయాతనలు అనుభవించారు.

అయితే అప్పటికే గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమంతో దేశంలో బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా ఆందోళనలు ఉధృతం అయ్యాయి. ఇటు సావర్కర్ ను విడుదల చేయాలని మహారాష్ట్ర ప్రాంతంలోనూ ఆందోళనలు తీవ్రతరం అయ్యాయి. మహారాష్ట్ర ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్తతలను చల్లార్చే ఈ క్రమంలో భాగంగా బ్రిటీష్ ప్రభుత్వం.. సావర్కర్ విడుదలకు కొన్ని షరతులు విధించింది. తాను అండమాన్ జైలులో ఉండేకంటే.., మహారాష్ట్ర ప్రాంతంలోని జైల్లో ఉంటూ అండర్ గ్రౌండ్ గా స్వాతంత్ర్య పోరాటానికి పనిచేయాలని సావర్కర్ భావించారు. దీని కోసం బ్రిటిష్ ప్రభుత్వం విధించిన షరతులకు అంగీకారం తెలుపుతూ సంతకాలు చేశారు. ఇదంతా ఆ సమయంలో వ్యూహం ప్రకారం చేశానని ఆ తర్వాత కాలంలో తనను కలిసి ఇంటర్వ్యూ చేసిన అనేక మంది విశ్లేషకులకు సావర్కర్ తెలిపారు. 1922లో అండమాన్ జైలు నుంచి విడుదలైన సావర్కర్.. 1937 వరకు కూడా రత్నగిరిలో గృహనిర్భందంలోనే ఉన్నారనే విషయం మనం మర్చిపోరాదు.

అలాగే నిరంజన్ తక్లే తన కథనంలో దేశంలో మతం మార్పిడులను పోత్సాహించాడని జిన్నా కంటే ముందే ద్విజాతి సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడని కూడా ఆరోపించాడు. సావర్కర్ కారణంగానే తర్వాతే కాలంలో జిన్నా ద్విజాతి సిద్ధాంతాన్ని స్వీకరించాల్సివచ్చిందని చెప్పుకొచ్చాడు తక్లే. దీనికి మళ్లీ స్వయం ప్రకటిత ముస్లిం చరిత్రకారుడైన షంసూల్ ఇస్లామ్ కథనాలనే నిదర్శన్నాడు. అలాగే 1942లో క్విట్ ఇండియా ఉద్యమం జరుగుతున్న సమయంలో సావర్కర్ బ్రిటిష్ వారి పక్షం వహించి దేశద్రోహం చేశాడనే పెద్ద ఆరోపణ చేశాడు తక్లే.! అంతటితో ఆగని తక్లే.. సుభాష్ చంద్రబోస్ కు వ్యతిరేకంగా భారతీయ యువకులు బ్రిటిష్ ఆర్మీలో చేరాలని సావర్కర్ పోత్సాహించాడని ఆరోపించాడు. ఇంకా సావర్కర్ అఖండ భారత్ ను కోరుకోలేదని.., సిక్కులకు ప్రత్యేక దేశం ఉండాలన్నారని కూడా చెప్పుకొచ్చాడు తక్లే.! సావర్కర్ పై తాను చేసిన ఈ ఆరోపణలకు మళ్లీ ముస్లిం చరిత్రకారుడైన షంసూల్ ఇస్లామ్ రాసినే పుస్తకంలోని కథలనే చూపాడు నిరంజన్ తక్లే.!

నిజానికి గాంధీ హత్య కేసులో సావర్కర్ కు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. గాంధీ హత్య కేసులో శిక్షపడిన గోపాల్ గాడ్సే, విష్ణు కర్కరే, మదన్ లాల్ పాహ్వా 1964లో జైలు నుంచి విడుదలైన తర్వాత వారికి ప్రజల్లో నిజమైన దేశభక్తులుగా మహారాష్ట్ర ప్రజలు అభినందిస్తూ  పెద్దఎత్తున సభలు నిర్వహించారు. దీంతో గాంధీజీ హత్య  జరిగిన 17 ఏళ్ళ తర్వాత…అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం. గాంధీ హత్య కేసుపై మరోసారి విచారణ జరపాలని సుప్రీం కోర్టు రిటైర్డ్ జస్టిస్ జీవన్ లాల్ కపూర్ నేతృత్వంలో 1965లో ఒక కమిటీని వేసింది. ఈ కమిటీ గాంధీ హత్య కేసులో సావర్కర్ పాత్రపై అనుమానాలు వ్యక్తం చేసిందని.. షంసూల్ ఇస్లామ్ చేసిన పేర్కొన్నాడని..నిరంజన్ తక్లే తన వ్యాసంలో చెప్పుకొచ్చాడు.

తప్పుడు తర్కాలతో …, అసలు ఆధారాలు చూపకుండా, అభూతకల్పనతో ఓ ముస్లిం చరిత్రకారుడు పుస్తకం రాస్తే.., దాన్నే ప్రామాణిక గ్రంథం అన్నట్లుగా… చూపి,  వీరసావర్కర్ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు ది వీక్ ఇంగ్లీష్ మ్యాగజైన్ కుట్ర చేసిందని వీరసావర్కర్ మనువడు రంజిత్ సావర్కర్ 2016లోనే ఆగ్రహం వ్యక్తం చేశాడు. ది వీక్ ప్రచురించిన కథనాన్ని సవాల్ చేస్తూ పరువునష్టం దావా వేశాడు.

దీంతో తాము ప్రచురించిన కథనాలకు కోర్టులో ఆధారాలు చూపలేక… చివరకు ఐదేళ్ల తర్వాత ది వీక్ మ్యాగజైన్.. క్షమపణలు చెబుతూ ప్రకటన చేసింది. 2016 జనవరి 24 న తాము ప్రచురించిన ముఖచిత్ర కథనం హీరో టు జీరో పై విచారం వ్యక్తం చేస్తూ అందర్ని క్షమాపణలు కోరుతున్నామని మే 14వ తేదీన వీక్ మ్యాగజైన్ ఓ ప్రకటన చేసింది.

సో అసత్యకథనాలు ఎల్లకాలం నిలువలేవు. నిజమనేది నిలకడ మీదనే తెలుస్తోందనే విషయం మనం మర్చిపోరాదు.    

Leave A Reply

Please enter your comment!
Please enter your name here