ముష్కరుల చేతిలో మాదక ద్రవ్యాల మాఫియా..!

0
1008

దేశవ్యాప్తంగా ప్రతీ రోజు ఎక్కడో ఒక చోట డ్రగ్స్ పట్టుబడుతూనే ఉంది. విదేశాల నుంచి భారీగా డంప్ అవుతున్న డ్రగ్స్ ను పట్టుకుంటూనే ఉన్నా సప్లై మాత్రం ఆడగం లేదు.

గుజరాత్‌లో రూ.1439 కోట్ల మాదకద్రవ్యాల పట్టివేత.. .. దిల్లీలో రూ.100 కోట్ల డ్రగ్స్‌ స్వాధీనం … పంజాబ్‌లో రూ.30 కోట్ల హెరాయిన్‌ కలకలం. ఇలా ఒక దాని తర్వాత ఒక డ్రగ్స్ రాకెట్ బయటపడుతున్నాయి. ఇలా ఎంత మందిని పట్టుకున్నా డ్రగ్స్ సప్లై ఆగకపోవడంతో దీని వెనుక ఉగ్రహక్తం ఉందా అన్న కోణంలో భద్రతా బలగాలు దర్యాప్తు చేస్తున్నాయి. ఈ వరుస ఘటనలతో నార్కో టెర్రరిజానికి అవకాశం ఉందని ఎన్‌సీబీ డైరెక్టర్ జనరల్ ఎస్​ఎన్​ ప్రధాన్ అభిప్రాయపడుతున్నారు. అంతర్జాతీయ డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టు చేయాలంటే మరింత పటిష్ఠమైన చట్టాలను అమలు చేయాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు.

మారుతున్న జీవన విధానం కారణంగా సంపన్న వర్గం మత్తుకు బానిస అయింది. ఖరీదైన డ్రగ్స్ కు బాగా వినియోగిస్తోంది. దీంతో డిమాండ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. దీన్ని ఆసరా చేసుకొని అంతర్జాతీయ డ్రగ్స్ మాఫియా దేశవ్యాప్తంగా పటిష్టమైన నెట్‌వర్క్ ఏర్పాటు చేసుకొని డ్రగ్స్ సరఫరా చేస్తోంది. ఈ డ్రగ్స్ మాఫియాకు ఉగ్రవాద సంస్థలు సహాయ సహకారాలు అందిస్తున్నాయని సమాచారం. అంతర్గత సంక్షోభాల్లో కూరుకుపోయిన దేశాల్లో డ్రగ్స్​ను పెద్ద మొత్తంలో ఉత్పత్తి చేసి వాటిని భారత్​కు సరఫరా చేస్తున్నాయి. ఇందుకు బదులుగా డ్రస్గ్ మాఫియా ఇచ్చే నిధులతో ఉగ్రవాద సంస్థలతో తమ ఉగ్ర కార్యకలాపాలకు యధేచ్ఛగా వినియోగిస్తున్నాయని సమాచారం. ముఖ్యంగా ఈ డ్రగ్స్ కేసులకు సంబంధించిన మూలాలు పాకిస్థాన్, అఫ్గానిస్థాన్​ దేశాల్లో ఉంటున్నాయని నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి.

భారత్ కు సరఫరా అవుతున్న డ్రగ్స్‌లో సింహభాగం పాకిస్థాన్​, అఫ్గానిస్థాన్​ దేశాల నుంచే దిగుమతి అవుతోంది. డ్రగ్స్ కేసుల్లో పట్టుబడుతున్న వాళ్లు కూడా ఈ దేశాలకు చెందిన వాళ్లే ఉంటున్నారు. దీంతో ఇది తప్పక నార్కో టెర్రరిజానికి దారితీస్తోందని ఎన్‌సీబీ అనుమానిస్తోంది. గతంలో అఫ్గానిస్తాన్‌లో నిధుల కోసం తాలిబన్ల నల్లమందు సాగును ప్రోత్సహించారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం నల్లమందుపై నిషేధం విధించారు. దీంతో ఇప్పుడు డ్రగ్స్ మాఫియా ఇతర దేశాల్లో డ్రగ్స్ ను ఉత్పత్తి చేసి భారత్‌కు సరఫరా చేస్తోందని డైరెక్టర్ జనరల్ ప్రధాన్ తెలిపారు. భారత్​ లాంటి పెద్ద మార్కెట్​లపై ఉగ్రవాదులు దృష్టి సారించారు. వేల కోట్లలో జరుగుతున్న హెరాయిన్​ను వ్యాపారంలో నగదును హవాలా రూపంలో చేతులు మారుతోంది. ఈ హవాలా డబ్బును మాఫియా అక్రమమార్గాల్లో ఉపయోగించి మరిన్ని సమస్యలు సృష్టిస్తోందని ఎన్‌.సీ.బీ ఆందోళన వ్యక్తం చేస్తోంది.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

2 × 1 =