More

  తాలిబన్ల రాజ్యంలో స్వేచ్ఛకు సంకెళ్లు..! ఆఫ్గాన్‎లో ఎక్కడాలేని శిక్షలు..!!

  తాలిబన్లు మరోసారి తమ బుద్ధిని బయటపెట్టారు. తమకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా.. ఏలాంటి చర్యలు పూనుకున్నా నిర్ధాక్షిణంగా చంపేసే తాలిబన్లు.. దానికి అనుగుణంగా మరో కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆఫ్గానిస్తాన్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తాలిబన్లు ఆ దేశంలో ఎక్కడలేని నిబంధనలు విధిస్తున్నారు.

  ఆఫ్గాన్ లో తమ పాలన విషయంలో విమర్శల అణచివేతకు తాలిబన్లు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎలాంటి కారణాలు లేకుండా ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ ఆఫ్గానిస్తాన్ ప్రభుత్వ ఉద్యోగులను, మేధావులను, నాయకులను మాటలు, సైగలతో ఇలా ఏ రూపంలోనైనా విమర్శించేవారికి శిక్షలు విధిస్తామని ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ సిబ్బంది, అధికారులపై ఆరోపణలకూ ఈ ఆదేశాలు వర్తిస్తాయని వెల్లడించింది. తాలిబన్ల అగ్ర నేత అఖుంద్జాదా ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రతినిధి జమియుల్లా ముజాహిద్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.

  వీటి అమలు ప్రజలు, మీడియాల షరియా బాధ్యతగా పేర్కొంది. కానీ ఎటువంటి విమర్శలపై చర్యలు తీసుకుంటారో మాత్ర కొత్త ఆదేశాల్లో స్పష్టం చేయలేదు. అయితే స్థానికంగా సామాజిక మాధ్యమాలు, టీవీ చర్చల్లో పలువురు ఎప్పటికప్పుడు తాలిబన్ ప్రభుత్వ విధానాలను ఎండగడుతూనే ఉన్నారు. ముఖ్యంగా బాలికా విద్యపై ఆంక్షలు, మహిళా, మానవ హక్కుల ఉల్లంఘనలపైనా తీవ్రంగా ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు కొత్త ఆదేశాల ప్రకారం ఇటువంటి చర్యలను ప్రభుత్వ వ్యతిరేక ప్రచారంగా పరిగణించనున్నట్లు సమాచారం. ప్రభుత్వంపై వ్యాఖ్యానాలు పరోక్షంగా శత్రువులకు సాయం చేస్తాయని తాలిబన్లు చెబుతున్నారు. అయితే ఎవరా శత్రువులు అనే దానిపై వివరణ ఇవ్వలేదని ఓ వార్తా సంస్ధ వెల్లడించింది.

  ప్రస్తుతానికి రెసిస్టెన్స్ ఫ్రంట్ ఇక్కడి ప్రభుత్వంతో పోరాడుతోంది. ఈ బృందం తాలిబన్ల విధానాలపై తీవ్ర విమర్శలకు దిగుతోంది. కొత్త ఉత్తర్వుల ప్రకారం ఎవరైనా తాలిబన్ సైనికుడిని తాకినా, లేదా అతని దుస్తులు లాగినా, చెడుగా మాట్లాడినా శిక్షార్హమైన నేరంగా పరిగణించనున్నారు. అయితే తాజా ఆదేశాలతో దేశంలో వాక్ స్వాతంత్ర్యం, భావ ప్రకటన స్వేచ్ఛ మరింత దిగజారతాయని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అణచివేత, హింసను మరింత బలంగా మారుస్తాయని తెలిపారు. తాలిబన్లు ఇప్పటికే సోషల్ మీడియాలో తమను విమర్శించిన కొంతమందిని అరెస్ట్ చేసి చిత్రహింసలు పెట్టినట్లు కొన్ని హక్కుల సంస్థలు, మీడియా నివేదికల్లో వెల్లడైంది. ఆఫ్గాన్ లో తాలిబన్లు తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత జర్నలిస్టులపైనా హింస రెట్టింపు అయ్యిందని ఆరోపించాయి.

  మరోవైపు ఆఫ్ఘనిస్తాన్‌లోని బగ్లాన్‌లో తాలిబన్లు ఒక యువకుడిని కాల్చి చంపి, అతని మృతదేహాన్ని అందరబ్ జిల్లా మార్కెట్‌లో బహిరంగంగా ప్రదర్శించారు. ఈ హత్యను వ్యతిరేకిస్తూ మృతదేహంతో స్థానికులు నిరసన ప్రదర్శన చేశారు. సంఘటనకు సంబంధించి తాలిబన్ నుండి వివరణ కోరినట్లు ఆఫ్ఘనిస్తాన్ వార్తా సంస్థ నివేదించింది. తాలిబన్లు అందరబ్ ప్రాంతంలో నివాసం ఉంటున్న వ్యక్తిని అతని ఇంటి నుండి బయటకు రమ్మని చెప్పారు. ఆ తర్వాత అతన్ని హత్య చేశారని ఆఫ్ఘన్ వార్తా సంస్థలు తెలిపాయి. ఈ చర్యకు వ్యతిరేకంగా జిల్లా భవనం ముందు గుమిగూడిన ప్రజలను చెదరగొట్టేందుకు గాలిలో కాల్పులు జరిపారు. ఆగస్ట్ 2021లో అధికారంలోకి వచ్చిన 10 నెలల్లో తాలిబాన్ అనేక మంది మాజీ భద్రతా దళాల అధికారులు, ఉద్యోగులను హతమార్చినట్లు ఆఫ్ఘనిస్తాన్‌లోని ఐక్యరాజ్యసమితి సహాయ మిషన్ నివేదిక వెల్లడించిన ఒక రోజు తర్వాత ఈ యువకుడి హత్య జరిగింది. 2021లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని పడగొట్టి, దేశాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత తాలిబన్లు పలు నేరాలకు పాల్పడ్డారు.

  spot_img

  Trending Stories

  Related Stories