More

    మరోసారి కశ్మీర్ ఫైల్స్.. జనవరి 19 నుంచి ప్రదర్శనలు..!

    వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన బాలీవుడ్ సంచలన మూవీ ‘ది కశ్మీర్ ఫైల్స్’. 2022లో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. తాజాగా ఆస్కార్ అవార్డుల కోసం అకాడమీ షార్ట్ లిస్ట్ చేసింది. ఇప్పుడు కశ్మీర్ హిందూ జాతి నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకుని 2023 జనవరి 19న ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ బ్లాక్‌బస్టర్‌‌ను మిస్ అయిన వారు పెద్ద స్క్రీన్‌‌లలో చూడవచ్చు. బుకింగ్‌లు కూడా మొదలయ్యాయి.

    అనుపమ్ ఖేర్, పల్లవి జోషి, దర్శన్ కుమార్.. ఇతరులు నటించిన ది కాశ్మీర్ ఫైల్స్ 1990ల ప్రారంభంలో కశ్మీరీ పండిట్‌ల ఊచకోతల ఆధారంగా రూపొందించిన సినిమా. ప్రపంచానికి తెలియని ఎన్నో దారుణాలను ఈ సినిమాలో చూపించారు. గత ఏడాది ఎన్నో భారీ బడ్జెట్ సినిమాలు హిందీలో విడుదలైనప్పటికీ.. ఏ సినిమాకు కూడా దక్కని కలెక్షన్స్ ఈ సినిమాకు దక్కాయి. ఇప్పుడు, కశ్మీర్ ఫైల్స్ మరోసారి జనవరి 19న సినిమాల్లో విడుదలవుతోంది. కశ్మీరీ హిందూ మారణహోమ దినం రోజున ఈ చిత్రాన్ని మళ్లీ థియేటర్లలోకి తీసుకురానున్నట్లు చిత్ర దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ప్రకటించారు.

    మార్చి 2022లో విడుదలైన ‘ది కశ్మీర్ ఫైల్స్’ బాక్సాఫీస్ వద్ద రూ.246 కోట్ల వసూళ్లు సాధించింది. ప్రస్తుతం వివేక్ అగ్నిహోత్రి ‘ది వ్యాక్సిన్ వార్’ సినిమాకు పని చేస్తున్నాడు. కశ్మీర్ ఫైల్స్ సినిమా ఆస్కార్ షార్ట్ లిస్ట్‌లో చోటు దక్కించుకుంది.

    Trending Stories

    Related Stories