వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన ‘ది కశ్మీర్ ఫైల్స్’ థియేటర్లలో భారీ కలెక్షన్స్ ను సాధిస్తోంది. విడుదలైన 10 రోజుల్లోనే బాక్సాఫీస్ కలెక్షన్లలో 170 కోట్ల రూపాయల మార్కును దాటింది. వచ్చే వారం నాటికి ఈ చిత్రం ₹200 కోట్ల క్లబ్‌లో చేరనుంది. ఈ చిత్రం శుక్రవారం (మార్చి 18) ₹19.15 కోట్లు రాబట్టింది, ఆ తర్వాత శనివారం (మార్చి 19) ₹24.80 కోట్లు రాబట్టింది. ఈ చిత్రం ఆదివారం (మార్చి 20) మొత్తం ₹26.20 కోట్లు వసూలు చేసింది. ఇది వారాంతంలో ₹70.15 కోట్లు వసూలు చేసింది. ‘ది కశ్మీర్ ఫైల్స్’ మొదటి వారంలో 97.30 కోట్ల నికర వసూళ్లు (నెట్ కలెక్షన్స్) సాధించింది.
సినీ విమర్శకుడు తరణ్ ఆదర్శ్ తన ట్వీట్‌లో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టిస్తోందని తెలిపారు. రెండో వీకెండ్ లో కూడా సూపర్-సాలిడ్ గా కలెక్షన్స్ ఉన్నాయని అన్నారు. “TheKashmirFiles [Week 2] is a TSUNAMI at the #BO… Packs a SUPER-SOLID total [₹ 70.15 cr] in Weekend 2… #TKF REFUSES TO SLOW DOWN, should hit ₹ 200 on weekdays [by Wed or Thu]… Fri 19.15 cr, Sat 24.80 cr, Sun 26.20 cr. Total: ₹ 167.45 cr. #India biz.” అంటూ ట్వీట్ చేశారు.
“ఈ చిత్రం ప్రస్తుతానికి తిరుగులేని శక్తిగా ఉంది. ఇప్పుడు రూ. 300 కోట్ల క్లబ్‌పై దృష్టి సారిస్తోంది. రాబోయే 10 రోజుల ట్రెండ్‌ను బట్టి, సినిమా ఒక బెంచ్‌మార్క్ ను సృష్టిస్తుంది. ఈ చిత్రం అన్ని కాలాలలో అత్యంత లాభదాయకమైన హిందీ చిత్రాలలో ఒకటిగా ఉండడమే కాకుండా.. బ్లాక్‌బస్టర్‌గా ఉద్భవించిన అరుదైన చిన్న బడ్జెట్ చిత్రాల జాబితాలో ‘జై సంతోషి మా’తో చేరుతోంది” అని పింక్‌విల్లా నివేదించింది.
90వ దశకంలో కశ్మీర్‌లో కశ్మీరీ పండిట్ పై జరిగిన దారుణాలను ఉన్నది ఉన్నట్లు దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి కళ్లకు కట్టినట్టు చూపించారు. కేవలం రూ. 15 కోట్ల పెట్టుబడితో నిర్మించిన ఈ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర కనక వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే పలువురు ప్రముఖులు ఈ సినిమాపై స్పందించారు. ఈ సినిమాకు బీజేపీ నేతృత్వంలోని రాష్ట్రాల్లో పన్నుమినహాయింపు ప్రకటించాయి. గుజరాత్, మధ్యప్రదేశ్,గోవా, కర్నాటక,త్రిపుర, ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ఈ సినిమాకు టాక్స్ ఫ్రీ మూవీగా ప్రకటించాయి. ఈ సినిమాను ప్రధాని మోదీ కూడా మెచ్చుకున్నారు. పలువురు సెలబ్రిటీలు కూడా ది కశ్మీర్ ఫైల్స్ సినిమా చూడాలని చెబుతున్నారు.