కింగ్ ఖాన్ ఖేల్ ఖతమేనా..? బాలీవుడ్ బాయ్‎కాట్ చేసిందా..?

0
880

షారూఖ్ ఖాన్.. బాలీవుడ్‎లో ఇది చాలా పెద్ద పేరు. ఒకప్పుడు ఆయన సినిమాలంటే జనం విపరీతంగా వచ్చేవారు. ఉత్తరాది మొత్తంలో షారూఖ్ సినిమాలను విపరీతంగా అభిమానించేవారు. ఎల్లలు లేని అభిమానం ఖాన్ సొంతం. ముంబై వీధుల్లో తిరిగే రిక్షాలు, ఆటోలు, ఆర్టీసీ బస్సుల్లో ఎటు చూసినా షారూఖ్ ఫోటోలే దర్శనమిచ్చేవి. ‘బాజీగర్ ఓ బాజీగర్’ సినిమా నుంచి ‘తూ మేరే సామ్నే’ వరకు షారూఖ్ సినిమా పాటల్ని ప్రతి ఒక్కరూ వల్లె వేసేవారు. టీకొట్లలో కూడా షారూఖ్ పాటలే వినిపించేవి. బాలీవుడ్ ఖాన్ ఎక్కువగా లవ్, రొమాంటిక్ కథలనే ఆధారంగా చేసుకుని సినిమాలను నిర్మించేవారు. అందుకే ఇవి అప్పట్లో అంత ఆదరాభిమానాలను సంపాదించాయి. తొలి సినిమా ‘దీవానా’ నుంచి మొదలు పెడితే.. ‘బాజీగర్’, ‘ఢర్’ వంటి ఎన్నో హిట్లు ఆయన ఖాతాలో వున్నాయి. ఇక ‘దిల్ వాలే దుల్హనియా లేజాయెంగే’ గురించి చెప్పుకోవాల్సిన పనేలేదు. దేశంలోనే కాదు, అంతర్జాతీయంగా కూడా ఆ సినిమా పేరు మారుమోగింది. అయితే, ఇదంతా గతం. ఈ మధ్య షారూఖ్ ఖాన్ సినిమాలు పెద్దగా ఆడటం లేదు. ఇటీవల ఆయన తెరపై కనిపించిన ప్రతీ సినిమా వరుసగా డిజాస్టర్‎గానే మిగిలిపోయింది. బాలీవుడ్‎లో అగ్రహీరోగా కొనసాగుతున్నా,.. భారీ హిట్ సంపాదించి దాదాపు దశాబ్దకాలం గడిచిపోయింది. అయితే ప్రతి ఒక్క ఫెయిల్యూర్‎కు ఏదో ఒక కారణం ఉంటుంది. అలాగే, షారూఖ్ ఫెయిల్యూర్ స్టోరీ వెనుక కూడా అనేక కారణాలున్నాయి. వీటిని ఎప్పటికప్పుడు సవరించుకుని ముందుకుసాగితే భవిష్యత్తులో హిట్లను సంపాదించే అవకాశం ఉంటుంది. లేకపోతే ఒకప్పటి వైభవం తిరిగి పొందటం చాలా కష్టం.

నిజానికి, షారూఖ్ సినిమాలే కాదు, దాదాపు బాలీవుడ్ సినిమాలన్నీ వరుస ఫ్లాపులను మూటగట్టుకుంటున్నాయి. బాలీవుడ్ ఒకప్పుడు భారత సినిమా సమ్రాజ్యాన్ని ఏకఛత్రాధిపత్యంగా ఏలినా,.. గత ఐదేళ్ళుగా భారీ కుదుపులకు లోనైంది. కాలానుగుణంగా మారుతున్న అభిరుచులను బట్టి ప్రేక్షకులు కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. లవ్ సినిమాలైనా, యాక్షన్ సినిమాలైనా కొత్తగా లేకపోతే ప్రేక్షకుల ఆదరణ తగ్గిపోతోంది. బాలీవుడ్ ఇండస్ట్రీ అప్రతిహతంగా కొనసాగుతున్నప్పుడు దాదాపు సినిమాలన్నీ ఒకే కాన్సెప్ట్ తో నిర్మితమయ్యేవి. సినిమా కథ వేరైనా,.. అన్నిట్లో ఒకేరకమైన సారూప్యత ఉండేది. క్లైమాక్స్‎ను కూడా ప్రేక్షకుడు ముందుగానే ఊహించి చెప్పగలిగేవారు. దీంతో ప్రేక్షకులకు తమ అభిరుచికి తగ్గట్లు సినిమాలు లేకపోవడంతో వీటిని చూడటానికి గతంలో ఉన్నంత ఆసక్తి కనబరచడంలేదు.

అయితే, బడా హీరోలకంటే.. చిన్న హీరోలు కొంతమేర విజయవంతమయ్యారు. పెద్ద హీరోలను తలదన్నేలా కొన్ని భారీ హిట్లు కూడా సాధించారు. వికీ కౌషల్, రాజ్ కుమార్ రావ్, కార్తిక్ ఆర్యన్ లాంటి యంగ్ హీరోలు.. ఖాన్ ఫ్యాక్టరీని విస్మయపరుస్తూ.. హిట్లు కొట్టారు. కొత్తదనం, కొత్త తరహా కథలతో ఆకట్టుకోవడంతో.. అప్పటికే షారూఖ్ ఖాన్ రొటీన్ సినిమాలతో విసిగి వేసారిన ప్రేక్షకులకు.. ఈ యంగ్ హీరోలకు త్వరగా అట్రాక్ట్ అయ్యారు. వీరంతా విభిన్నమైన కథాంశాలను ఎంచుకుని రొటీన్ కు భిన్నంగా సినిమాలను తీశారు. ప్రేక్షకులను మెప్పించారు. ‘ఉరీ’, ‘షేర్షా’, ‘షాదీ మే జరూర్ ఆనా’ లాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను రాబట్టాయి. వీరితో పాటు దివంగత నటుడు సుషాంత్ సింగ్ రాజ్‎పుత్ కూడా తన టాలెంట్‎తో పైకి వచ్చినవాడే. యూనివర్శిటీలో గోల్డ్ మెడలిస్ట్ అయినా.. సినిమాలపై ఆసక్తితో బాలీవుడ్‎లో ప్రవేశించాడు. బాలీవుడ్‎లో సుశాంత్ ఎన్నో మంచి మంచి సినిమాలను తీస్తూ ప్రేక్షకుల మన్ననలు పొందాడు. వీరందరికీ ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా సినిమాల్లో తమ టాలెంట్‎తో నిలదొక్కుకున్నారు. అయితే కొత్త వారు వస్తే తమ భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుందని.. ఖాన్ గ్యాంగ్ ఈ అప్ కమింగ్ హీరోలను తొక్కివేయడం జరిగింది. వీరికి కొత్త సినిమాలు అందకుండా చేయడం, బాలీవుడ్ సర్కిల్స్‎లోని థియేటర్లలో వీరి సినిమాలను ఆడకుండా చేయడం వంటివి చేశారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో సుశాంత్ సింగ్ రాజ్‎పుత్ తన జీవితంలో ఇక బాలీవుడ్‎లో భవిష్యత్తు ఉండదనే నిరాశతో తనకు తానుగా ప్రాణాలు తీసుకున్నాడు. ఇప్పటికీ సుశాంత్ మరణానికి ఖాన్ త్రయమే కారణమనే ఆరోపణలున్నాయి.

ఖాన్ త్రయాన్ని ప్రేక్షకులకు దూరం చేసిన కారణాల్లో.. ఇలాంటి ఆరోపణల నేపథ్యం కూడా ఒకటి. అదే సమయంలో కొత్త దనాన్ని ఆకలింపు చేసుకోకపోవడం మరో కారణం. దీంతో మూసదోరణిలో ఉండే షారూఖ్ ఖాన్ సినిమాలు కూడా ప్రేక్షకులను అంతగా రుచించలేదు. షారూఖ్‎కు ప్రేక్షకాదరణ తగ్గడానికి మరో బలమైన కారణం ఉంది. ఎప్పుడైనా ప్రేక్షకులు కోరుకునే విధంగా వారికి కొత్తదనాన్ని అందించాల్సి ఉంటుంది. దీనికోసం కొత్త ఆలోచనలున్న డైరెక్టర్లకు అవకాశాలు ఇవ్వాలి. అయితే షారూఖ్‎తో పాటు బాలీవుడ్ అగ్రహీరోలంతా బంధుప్రీతి, వారసత్వాన్నే నమ్ముకున్నారు. ఎటువంటి టాలెంట్ లేకపోయినా దర్శక వారసులకే అవకాశాలిచ్చారు. దీంతో వారికి వచ్చినదాన్నే సినిమాగా తీస్తున్నారే తప్ప కొత్తవాటిని తీయడంలేదు. షారూఖ్ ఖాన్ కూడా ఈ నెపోటిజం చట్రంలో చిక్కుకుని అవే పాత సినిమాలనే ప్రజలముందుకు తీసుకురావడంతో అవి డిజాస్టర్లుగానే మిగులుతున్నాయి.

నిజానికి, ఇప్పుడు దేశంలో భారతీయత ట్రెండ్ బాగా నడుస్తోంది. దేశభక్తి, జాతీయభావం, సంస్కృతి సంప్రదాయాల నేపథ్యం ఉన్న సినిమాలు భారీ కలెక్షన్లు సాధిస్తున్నాయి. ఇటీవలే వచ్చిన ట్రిపులార్, కాంతార, ది కశ్మీర్ ఫైల్స్ పూర్తిగా భారతీయతను ఆధారంగా చేసుకుని తీసిన సినిమాలే. అందుకే, తక్కువ బడ్జెట్ తో నిర్మించిన కాంతార, ది కశ్మీర్ ఫైల్స్ సినిమాలు.. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సంపాదించాయి. అయితే ఖాన్ గ్యాంగుకు భారతీయత, దేశభక్తి, జాతీయభావం, సంస్కృతి, సంప్రదాయం అనే పదాలు అస్సలు రుచించవు కదా..! మరీ ముఖ్యంగా షారూఖ్ ఖాన్‎కు అటువంటి కథలకు చాలా దూరం. ఎప్పుడూ పాకిస్తాన్ దుష్టశక్తులు, డీగ్యాంగ్ కనుసన్నల్లో కదిలే.. ఈ సోకాల్డ్ కింగ్ ఖాన్.. భారతీయుల గురించి, భారతీయత గురించి సినిమాలు తీస్తాడని కలలోనైనా ఊహించలేం. పూర్తి భారతీయత ట్రెండ్ నడుస్తున్న ఈ కాలంలో షారూఖ్ ఖాన్ ఏకంగా పఠాన్ అనే పేరుతో ఆఫ్ఘనిస్తాన్ పఠాన్లను బేస్‎గా చేసుకుని ఎడారుల్లో సినిమాలను నిర్మిస్తున్నాడు. అగ్రభాగం షూటింగ్ ను పూర్తి చేసుకున్న పఠాన్ సినిమా 2023లో విడుదల కాబోతోంది. అయితే ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడే అవకాశాలు మెండుగా ఉన్నాయనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. తాజాగా విడుదలైన ట్రైలర్ చూస్తే.. పూర్తి యాక్షన్ మూవీ అయినప్పటికీ.. ఈ సినిమాలో కొత్తదనం కానీ తాజా ట్రెండ్ కానీ ఏమీ లేనట్టే కనిపిస్తోంది.

నిజానికి, షారూఖ్ ఒక్కడే కాదు.. బాలీవుడ్ లో ఖాన్ త్రయానికి గడ్డుకాలం నడుస్తోంది. ఇటీవలే అమీర్ ఖాన్ తీసిన లాల్ సింగ్ చద్దా సినిమా బాయ్ కాట్ ట్రెండ్ కు బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడింది. అమీర్ ఖాన్ ఏదైనా సినిమా తీస్తే సాధారణ హిట్ ఖాయం అనే టాక్ అందర్లోనూ ఉండేది. అటువంటి స్థాయి నుంచి అత్తెసరు కలెక్షన్లను కూడా రాబట్టలేని పరిస్థితికి అమీర్ ఖాన్ దిగజారిపోయాడు. అమీర్ ఖాన్ విషయంలో గతంలో చేసిన పాపాలన్నీ ఒకేసారి చుట్టుముట్టినట్టు.. మూటగట్టుకుని మీదపడ్డాయి. ఎన్నో ఆశలు పెట్టుకున్న లాల్ సింగ్ చద్దా పై ఎన్నడూ లేనంతగా వ్యతిరేకత వ్యక్తమైంది. ఇటు షారూఖ్ ఖాన్ తాజా పఠాన్ సినిమాకు కూడా ఇప్పటికే ఈ బాయ్ కాట్ సెగ తగులుతోంది. షారూఖ్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఈ టీజర్ బాయ్ కాట్ ట్రెండ్ ను మూటగట్టుకుంటోంది. సుషాంత్ సింగ్ రాజ్ పుత్ ను సినిమాల్లో ఎదగకుండా ఖాన్ త్రయం తొక్కివేశారని.. అందుకే వీరి సినిమాలు చూడవద్దంటూ పలువురు నెటిజన్లు కోరుతున్నారు. సుశాంత్ సింగ్ చనిపోయిన తర్వాత షారూఖ్ ఖాన్ నుంచి వచ్చే మొదటి సినిమా పఠాన్ కావడంతో ఈ సినిమాకు బాయ్ కాట్ ట్రెండ్ గట్టిగానే తగిలేటట్లు కనిపిస్తోంది. ఒకప్పుడు ఈ ట్రెండ్ సినిమాలపై అంతగా ప్రభావితం చూపకపోయినా ఇప్పుడు భారీ నష్టాన్నే కలిగిస్తున్నాయి. దీంతో పాటు పఠాన్ సినిమా కూడా పాత సినిమాల్లోని యాక్షన్ లాగే కనిపిస్తుండటం.. ప్రేక్షకుల అభిరుచి మేరకు కొత్తదనం ఏదీ లేనట్టే కనిపిస్తోంది. దీంతో ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని సినీ క్రిటిక్స్ అంచనా వేస్తున్నారు.

ఇదిలావుంటే, షారూఖ్ ఖాన్ కు ఇప్పుటికే వయసు మీరిపోతోంది. గతంలో తీసినంత ఎనర్జిటిక్ గా ఇప్పుడు సినిమాల్లో నటించడంలేదు. 2013 లో చెన్నై ఎక్స్ ప్రెస్ తర్వాత అంతటి హిట్ ఏదీ రాకపోవడంతో 2018 తర్వాత భారీ గ్యాప్ తీసుకున్నాడు. ఇకపై వచ్చే సినిమాలు కూడా ప్రేక్షకులను మెప్పించేంతగా లేవని ఇప్పటికే పలువురు భావిస్తున్నారు. దీంతో బాలీవుడ్ లో ఇక షారూఖ్ ఖాన్ ప్రస్థానం ముగిసినట్టేనని.. సినీ క్రిటిక్స్ భావిస్తున్నారు.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

17 − 15 =