More

  ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇంగ్లండ్..?! ఆశ్చర్యపోతున్నారా..? జరగబోయేది అదే..!

  యూరోపియన్ యూనియన్ దేశాల్లో క్రిస్టియానిటీ తగ్గిపోతోందా..? తాజాగా యూకే ప్రభుత్వం వెల్లడించిన జనాభా లెక్కలు ఏం చెబుతున్నాయి..? ఆ దేశంలో ముస్లిం జనాభా ఎందుకు పెరుగుతోంది. అనే విషయాలన్నిటి గురించి తెలుసుకునేముందు నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానెల్స్ ను సబ్ స్క్రయిబ్ చేసుకుని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో పదిమందికీ షేర్ చేసి మీ స్నేహితులను సబ్ స్క్రయిబ్ చేసుకునేలా ప్రోత్సహించండి. జాతీయవాద భావాలు పెంపొందించడంలో మీ వంతు పాత్ర పోషించండి. ఇక స్టోరీలోకి వెళితే..

  తాజాగా బ్రిటన్ ప్రభుత్వం యూకేలోని జనాభా లెక్కలను విడుదల చేసింది. ‘ఆఫీస్ ఫర్ నేషనల్ స్టాటిస్టిక్స్’ ఇచ్చిన డేటాలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. గతంలో ఎన్నడూ లేనంతగా మొట్టమొదటిసారి యూరప్ దేశాల్లో క్రిష్టియానిటీ జనాభా 50శాతానికి పైగా పడిపోయింది. కేవలం ఒక దశాబ్ద కాలంలోనే 13 శాతం మేరకు తగ్గుదల కనిపించింది. 2011లోని జనాభా లెక్కల ప్రకారం యూకేలో 59.3 శాతం క్రిష్టియన్ జనాభా ఉంటే తాజాగా వచ్చిన లెక్కల్లో అది 46.2శాతానికి పడిపోయింది. మరోవైపు హిందువుల జనాభాలో 0.2శాతంతో స్వల్ప ఎదుగుదల కనబరిచి 1.7 శాతానికి ఎగబాకింది. అయితే అనూహ్యంగా యూకేలో ముస్లిం జనాభాలో మాత్రం భారీ మార్పు కనిపించింది. 2011లో 4.9 శాతంగా ఉన్న జనాభా 2021లో 6.5శాతానికి ఎగబాకింది. అయితే ఈ విధంగా యూకేలో ముస్లిం జనాభా పెరగడానికి ప్రధాన కారణమేంటి..? అనే విషయాలు ఇప్పుడు పరిశీలిద్దాం.

  ముస్లిం జనాభా యూరప్ దేశాల్లో పెరగడం వెనుక యూరప్ లో దశాబ్ద కాలం క్రితం భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. మరీ ముఖ్యంగా 2011 ఫిబ్రవరిలో జరిగిన ‘అరబ్ స్ప్రింగ్’ అల్లర్లు యూరప్ దేశాల్లో భారీ వలసలకు దారితీసాయి. దీంతో పాటు సిరియా, ఇరాక్ దేశాల్లో ఉన్న రాజకీయ అనిశ్చితి కూడా యూరప్ దేశాలకు వలసలకు దారితీసాయి. మధ్య ఆసియాలో యాభైకి పైగా ముస్లిం దేశాలున్నా,.. ఎక్కువ వలసలు యూరప్ దేశాలవైపే సాగాయి. లక్షలాది మంది ప్రజలు యూరప్ దేశాలకు వలసలు వెళ్ళారు. వీరికి తోడు బ్రిటన్ ప్రభుత్వాలు శరణార్థులను ఆదరించే పేరుతో వారికి పౌరసత్వాలిచ్చి ప్రోత్సహించడం, వారిని స్వంత దేశాలకు తిప్పి పంపే ప్రయత్నాలు కూడా చేయలేకపోయింది. ప్రధాన నగరాలైన లీసెస్టర్, లండన్ లలో ప్రత్యేకంగా ముస్లిం కాలనీలను ఏర్పాటు చేసి మరీ వారిని ప్రోత్సహించింది. ఈ కాలనీల్లో ఇతరులు ప్రవేశించాలన్నా కొన్ని నిబంధనలు పాటించేలా వీలు కల్పించింది. ఆయా ప్రాంతాల్లో ఇతర మతాలవారు నివసించకుండా ఆంక్షలు విధించడం లాంటి చర్యలతో ముస్లిం జనాభా పెరగడానికి అనుకూల పరిస్థితులు కల్పించింది. వీటితో పాటు ముస్లిం దేశాలకు ఇస్తోన్న వీసాల నిబంధనలు కూడా చాలా సులభతరం చేయడం లాంటి చర్యలకు పూనుకోవడంతో లండన్ కు వలసలు భారీగా పెరిగాయి. దీంతో వలసలకు గురైన మస్లిం జనాభా మెల్లమెల్లగా యూరప్ దేశాల్లో పెరుగుతూ వచ్చింది.

  అయితే బ్రిటన్ ప్రభుత్వం శరణార్థులను భారీగా చేరదీయడం వల్ల కొన్ని సమస్యలను కూడా ఎదుర్కుంటోంది. శరణార్థుల వల్ల దేశంలో అశాంతితో పాటు ఇతర మతాలవారిపై దాడులు కూడా ఎక్కువవుతున్నాయని పలువురు భావిస్తున్నారు. ఇటీవలే లీసెస్టర్ లో భారీగా హింస చెలరేగింది. దీపావళి పండుగరోజు హిందువులే టార్గెట్ గా చేసుకుని పాకిస్తాన్ ముస్లింలతో పాటు ఇతర దేశాల నుంచి వచ్చిన ముస్లిం శరణార్థులు హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారు. హిందూ దేవాలయాలపై దాడులకు పాల్పడ్డారు. ఇటువంటి ఘటనలు కేవలం ఇప్పుడే కాదు. గతంలోనూ భారీగా జరిగాయి. దీంతో బ్రిటన్ ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యవాదులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటివరకూ యూరప్ లో అక్రమంగా నివసిస్తున్న వారందరినీ తిరిగి వారి దేశాలకు పంపివేయాలని బ్రిటన్ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అంతే కాదు ఇప్పటికే దేశంలో క్రిస్టియన్ జనాభా కూడా తగ్గిపోతుండటం వల్ల శరణార్థుల వల్ల మరింత ప్రమాదమేర్పడుతుందని హెచ్చరిస్తున్నారు.

  Trending Stories

  Related Stories