More

    పెళ్లైన మహిళను మతం మారాలంటూ ప్రియుడి ఒత్తిడి.. ఆరా తీస్తే..!

    అమ్మాయిలకే కాదు.. మహిళలకు కూడా మత మార్పిడి ఒత్తిడిలు ఎదురు అవుతున్నాయి. ఓ వర్గం యువకులు హిందూ అమ్మాయిలే టార్గెట్ గా లవ్ జీహాద్ కు పాల్పడుతున్నారు. ప్రేమించినట్లు నటించి చివరికి పెళ్లి విషయం వచ్చే సరికి మతం మారాలంటూ ఒత్తిడి తీసుకువస్తున్నారు. అలాంటి ఘటనే ఒకటి మధ్య ప్రదేశ్ లో తాాజాగా వెలుగు చూసింది.

    ప్రేమిస్తున్నానంటూ ఆమె వెంటపడ్డాడు. అతడి మాటలు నమ్మిన ఆమె.. శారీరకంగా దగ్గరైంది. తీరా పెళ్లి ప్రస్తావన తీసుకువచ్చాక.. అతడి నిజస్వరూపం తెలుసుకొని బాధితురాలు షాకైంది. అనంతరం ఆమెను మతం మార్చుకోవాలని ఒత్తిడి చేయడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది.

    భోపాల్‌లోని అశోకనగర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో నిహల్‌ ఖాన్‌ అనే వ్యక్తి ఆసుపత్రిని రన్‌ చేస్తున్నాడు. ఆసుపత్రిలో బాధితురాలు ఫిజియోథెరిపిస్టుగా పని చేస్తోంది. కాగా, కుటుంబ కలహాల కారణంగా బాధితురాలు 2018లో తన భర్త నుంచి విడిపోయి ఒంటరిగా బ్రతుకుతోంది. అయితే, ఆమె ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న క్రమంలో నిహల్‌ ఖాన్‌లో క్లోజ్‌నెస్‌ ఏర్పడింది. ఈ క్రమంలో ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో వారిద్దరూ శారీరంగా ఒక్కటయ్యారు. తీరా పెళ్లి ప్రస్తావన తెచ్చాక.. తాను హిందు కాదని ముస్లిం అని చెప్పడంతో ఆమె ఒక్కసారిగా షాకైంది.

    నిహల్‌ ఖాన్‌ తనను మోసం చేశాడని గుర్తించింది. అనంతరం అతడిని ఎందుకిలా చేశావని నిలదీయగా.. మతం మార్చుకుంటే తనను పెళ్లి చేసుకుంటానని నిహల్‌ చెప్పడంతో ఖంగుతింది. ఈ క్రమంలో ఆమెను మతం మారాలని అతడు ఒత్తిడి చేస్తున్నాడని బాధితురాలు పోలీసులను ఆ‍శ్రయించింది. ఆమె ఫిర్యాదుతో పోలీసులు నిహాల్ ఖాన్‌పై మధ్యప్రదేశ్ మత స్వేచ్ఛ చట్టం, భారతీయ శిక్షాస్మృతి ప్రకారం అత్యాచారం ఆరోపణలపై ప్రథమ సమాచార నివేదిక నమోదు చేసినట్టు తెలిపారు.

    Trending Stories

    Related Stories