More

    ఐపీఎల్ వేలం నిర్వహిస్తూ కుప్పకూలిన హ్యూ ఎడ్మీయడస్.. హెల్త్ అప్డేట్ ఇదే

    ఐపీఎల్ వేలం నిర్వహిస్తున్న ప్రముఖ ఆక్షనీర్ హ్యూ ఎడ్మీయడస్ ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో అందరూ షాక్ అయ్యారు. హసరంగా వేలంపాట నిర్వహిస్తూ ఆయన ఉన్నట్టుండి ముందుకు వాలిపోయారు. ఐపీఎల్ వేలంలో పాల్గొంటున్న వివిధ ఫ్రాంచైజీలకు చెందిన వ్యక్తులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటనతో టీవీ చానళ్లలో లైవ్ ప్రసారం కూడా ఆపేశారు. ఎడ్మీయడస్ ను హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు. హ్యూ ఎడ్మీయడస్ బ్రిటన్ జాతీయుడు. 2018 నుంచి ఐపీఎల్ వేలం నిర్వహిస్తున్నారు. గతంలో రిచర్డ్ మ్యాడ్లీ ఐపీఎల్ వేలం నిర్వహించగా, అతడి స్థానంలో ఎడ్మీయడస్ వేలం నిర్వహణ చేపట్టారు.

    ఐపీఎల్ వేలం నిర్వహిస్తున్న హ్యూ ఎడ్మీయడస్ సురక్షితంగా ఉన్నారని క్రిక్ బజ్ నివేదించింది. మెగా వేలం వేదిక అయిన బెంగళూరులోని ఐటీసీ గార్డెనియా హోటల్‌లో ఎడ్మీడెస్ చికిత్సకు ప్రతిస్పందిస్తున్నారని.. అతను బాగానే ఉన్నారని సమాచారం. లంచ్ తర్వాత వేలంపాటను కొనసాగించాలని భావిస్తున్నారు. హసరంగా వేలంపాట నిర్వహిస్తూ ఉండగా.. ఆయన పడిపోవడంతో లంచ్ బ్రేక్ ఇవ్వాలని వేలం నిర్వాహకులు నిర్ణయించారు. మధ్యాహ్నం 3:30కి వేలంపాట తిరిగి ప్రారంభం అవ్వనుందని స్టార్ స్పోర్ట్స్ తెలిపింది.

    ఇప్పటి వరకూ సాగిన వేలంలో అత్యధికంగా శ్రేయస్‌ అయ్యర్‌ ను 12.25 కోట్లకు కోల్‌కతా నైట్‌రైడర్స్‌ సొంతం చేసుకుంది. ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ను ఢిల్లీ క్యాపిటల్స్ 6.25 కోట్ల బిడ్ తో గెలిచింది. దక్షిణాఫ్రికా క్రికెటర్, వికెట్ కీపర్ క్వింటన్ డీకాక్ ను 6.75 కోట్లకు లక్నో సూపర్ జెయింట్స్ సొంతం చేసుకుంది. ఫాప్ డుప్లెసిస్ ను ఆర్సీబీ 7 కోట్లతో సొంతం చేసుకుంది. మహమ్మద్ షమీని 6.25 కోట్లతో గుజరాత్ టైటాన్స్ సొంతం చేసుకుంది. ట్రెంట్ బౌల్ట్ ను 8 కోట్లతో రాజస్థాన్ రాయల్స్ జట్టు గెలుచుకుంది. సీఎస్కే జట్టు బ్రావోను ఎట్టకేలకు మళ్లీ దక్కించుకుంది. 4.4 కోట్లతో వేలంలో తిరిగి సొంతం చేసుకుంది. నితీష్ రాణాను రూ.8 కోట్లతో కేకేఆర్, జేసన్ హోల్డర్ ను రూ.8 కోట్లతో లక్నో సూపర్ జెయింట్స్ గెలుచుకున్నాయి. సురేష్ రైనా, స్టీవ్ స్మిత్, డేవిడ్ మిల్లర్, షకీబ్ అల్ హసన్ లను కొనడానికి ఎవరూ ఆసక్తి చూపలేదు. ఏదైనా జట్టు వీరిని కావాలనుకుంటే తిరిగి రేపు వేలంపాటలో అందుబాటులో ఉంటారు.

    Trending Stories

    Related Stories