National

కశ్మీరీ పండిట్ అనుకుని.. ఇబ్రహీం ఖాన్ అనే వ్యాపారిని చంపేసిన తీవ్రవాదులు

శ్రీనగర్‌లోని పాతబస్తీ ప్రాంతంలో ఇస్లామిక్ ఉగ్రవాదులు సోమవారం నాడు కశ్మీరీ సేల్స్‌మెన్ మహ్మద్ ఇబ్రహీం ఖాన్ (45)ను కాల్చి చంపారు. ఇబ్రహీం ఖాన్ బోహ్రీ కడల్‌లో కశ్మీరీ పండిట్ నడుపుతున్న కిరాణా దుకాణంలో సేల్స్‌మెన్‌గా పనిచేస్తున్నాడు.తీవ్రవాదుల కాల్పుల్లో అతడి ఛాతి, పొత్తికడుపులోకి తూటాలు చొచ్చుకు వెళ్లాయి. అతడు చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. కశ్మీరీ పండిట్ అయిన దుకాణం ఓనర్ ను ఉగ్రవాదులు చంపాలని అనుకున్నారని.. తమ కొడుకును పొరపాటున చంపేసిందని బాధితుడి కుటుంబం తెలిపారు.

జర్నలిస్ట్ ఆదిత్య రాజ్ కౌల్ ట్విట్టర్‌లో ఈ ఘటనకు సంబంధించి ఒక వీడియోను పోస్ట్ చేశారు. అందులో బాధితుడి కుటుంబం రోదిస్తున్నట్లు మీరు చూడొచ్చు. వ్యాపారవేత్త దూరంగా ఉన్న కారణంగా.. ఉగ్రవాదులు ఇబ్రహీం ఖాన్‌ను షాప్ యజమానిగా భావించి అతనిని చంపేశారని కుటుంబ సభ్యులు చెప్పుకొచ్చారు.

‘నేను కాశ్మీర్‌ను వదిలి వెళ్లను’
షాపు యజమాని డాక్టర్ సందీప్ మావాను చంపడానికి ప్రయత్నిస్తున్నారనే విషయం గురించి తెలుసుకుని పోలీసులు అప్రమత్తమయ్యారు. డాక్టర్ సందీప్ మావా మాట్లాడుతూ “నా దగ్గర XUV (వాహనం) ఉంది. నన్ను టార్గెట్ చేయవచ్చని పోలీసుల నుండి మధ్యాహ్నం 3 గంటల సమయంలో నాకు కాల్ వచ్చింది. దీంతో నేను నా చిన్న కారులో ఇంటి నుండి బయలుదేరాను. ఇక ఇబ్రహీం ఖాన్ రాత్రి 8 గంటల సమయంలో స్టోర్ నుండి నా XUV తీసుకోవడానికి వెళ్లాడు. అక్కడ చీకట్లో ఉగ్రవాది పొంచి ఉన్నాడు. అతను నేనే అనుకుని ఖాన్ పై కాల్పులు జరిపాడు. ఖాన్ కుటుంబానికి ఏమి చెప్పాలో నాకు తెలియదు. అతని మరణానికి నేనే కారణమని అనిపిస్తుంది ” అని తెలిపాడు. ఉగ్రవాదుల భయంతో కశ్మీర్‌ను విడిచిపెట్టబోనని సందీప్ చెప్పారు. నేను (కశ్మీర్)ని విడిచిపెట్టను.. తుపాకీకి భయపడను అని చెప్పారు. 1990లలో సందీప్ తండ్రిని కూడా ఉగ్రవాదులు కాల్చినట్లు తెలిపారు. మా నాన్న ఢిల్లీలో ఉన్నారు. నేను నా భార్య మరియు ఇద్దరు పిల్లలతో శ్రీనగర్‌లో ఉన్నాను. తాజా సంఘటన తర్వాత వారు చాలా భయపడ్డారని మావా అన్నారు.

ఉగ్రవాద సంస్థ ‘ముస్లిం జన్‌బాజ్ ఫోర్స్’ ఖాన్‌ మరణానికి బాధ్యత వహించింది. సంతకం లేని లేఖలో తండ్రీకొడుకులు (సందీప్ మావా మరియు అతని తండ్రి రోషన్ లాల్ మావా) ‘ఇండియన్ ఏజెన్సీల’ కోసం పనిచేస్తున్నందున నిజమైన టార్గెట్లు వారేనని ఇస్లామిక్ ఉగ్రవాదులు తెలిపారు. కశ్మీర్‌కు స్థానికేతరులను తీసుకురావడంలో వారు సహాయ పడుతున్నారని లేఖలో తీవ్రవాదులు తెలిపారు.

దీపావళి తర్వాత రెండో హత్య
దీపావళి పండుగ తర్వాత లోయలో ఉగ్రవాదులు జరిపిన రెండో హత్య ఇది. ఖాన్‌ను కాల్చి చంపడానికి ఒక రోజు ముందు, ఉగ్రవాదులు బటామలూ ప్రాంతంలో 29 ఏళ్ల పోలీసు కానిస్టేబుల్ తౌసీఫ్ అహ్మద్ వనీని చంపారు. అక్టోబర్ నెల నుండి శ్రీనగర్ హై అలర్ట్‌లో ఉంది. లోయలో అదనంగా 5,000 మంది పారామిలటరీ సిబ్బందిని కేంద్రం మోహరించింది.

లోయలో ఇటీవల జరిగిన పౌరుల హత్యలకు వ్యతిరేకంగా శ్రీనగర్ మునిసిపల్ కార్పొరేషన్ కౌన్సిలర్లు లాల్ చౌక్ లో మంగళవారం కొవ్వొత్తులతో నిరసన చేపట్టారు.

https://twitter.com/ANI/status/1458121006489354243

Related Articles

Back to top button