సరిహద్దు గ్రామంలో ఆరుగురిని హత్య చేసిన తీవ్రవాదులు

0
866

కెన్యాలోని సరిహద్దు గ్రామంలో ఇస్లామిక్ తీవ్రవాదులు ఆరుగురిని దారుణంగా హత్య చేశారు. ఒకరి గొంతు కోసి, నలుగురిని సజీవ దహనం చేశారు. ఒకరి తలపై కాల్పులు జరిగాయి. సోమాలియా సరిహద్దులోని ఓ గ్రామంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన వెనుక సోమాలియా ఉగ్రవాద సంస్థ ‘అల్ షబాబ్’ హస్తం ఉంది. గత దశాబ్ద కాలంగా, టెర్రర్ గ్రూప్ కెన్యాలోకి ప్రవేశించి పౌరులను చంపుతూ ఉంది. లాము కౌంటీలో జరిగిన ఈ ఘటనలో బాధితుల ఇళ్లకు ఉగ్రవాదులు నిప్పు పెట్టారు. ఓ వ్యక్తి గొంతును కోసి చంపారు ఉగ్రవాదులు. అక్కడితో ఆగని తీవ్రవాదులు తలలో బుల్లెట్లను కూడా దించారు. చేతులు కట్టేసి సజీవ దహనమైన స్థితిలో నలుగురి మృతదేహాలను పోలీసులు వెలికితీశారు. వారిని గుర్తించడం కష్టతరంగా మారింది. 2011లో అల్-షబాబ్‌ను నియంత్రించడానికి కెన్యా కూడా సోమాలియాకు ఆర్మీ బృందాన్ని పంపింది. 2013లో నైరోబీలోని ఓ షాపింగ్ మాల్‌తో పాటు 2015లో ఈశాన్య ప్రాంతంలోని ఓ యూనివర్శిటీపై ఉగ్రవాదులు దాడి చేశారు.

ఆఫ్రికన్ యూనియన్ శాంతి పరిరక్షక దళం కింద కెన్యా సైన్యం ఇప్పటికీ సోమాలియాలో ఉంది. తాజా ఘటనలకు సంబంధించి 8 మంది నిందితులను కెన్యా పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన జనవరి నెలలో చోటు చేసుకున్నట్లు సమాచారం. కాల్పులు జరిపిన వ్యక్తి మృతదేహాన్ని రోడ్డుపక్కన విసిరేశారు. గొంతు కోసిన వ్యక్తి ఇంటిని లూటీ చేసి తగులబెట్టారు. కెన్యా పోలీసులు మాత్రం ఇది ఉగ్రవాద సంస్థ పని అని చెప్పడం లేదు.