గుంటనక్క పాకిస్తాన్ ను నమ్మొద్దు..! భారత్ అంటే… చాలూ! పాకిస్తాన్ నిలువెళ్లా విషం చిమ్ముతుంది. అదో డేంజర్ కంట్రీ ! ఉగ్రవాదులకు స్వర్గధామం. అలాంటి పాకిస్తాన్ తో ఇండియాకు పీస్ టాక్స్ ఏంటీ? వద్దు సార్..! పాక్ ను నమ్మితే…అది మరోసారి మనకు వెన్నుపోటు పొడవడం ఖాయం..! ఏమిటీ ఇదంతా అని అనుకుంటున్నారా? భారత్, పాక్ ల మధ్య జరుగుతున్న శాంతి చర్చలు, రెండు దేశాల మధ్య వాణిజ్యానికి గేట్లు తెరవడం తాలుకు వార్తలపై, నేషనలిస్ట్ హబ్ చేసిన ఓ వీడియో స్టోరీని, వీక్షించిన తర్వాత నెటిజన్లు చేసిన చేసిన కామెంట్లు ఇవి.!
ఒక వైపు భారత్ తో పీస్ టాక్స్ అంటునే…, మరోవైపు క్రాస్ బోర్డర్ టెర్రరిజాన్ని పోత్సహించడం మాత్రం పాకిస్తాన్ ఇంకా ఆపడం లేదని క్లియర్ గా తెలుస్తోంది. మోదీ ప్రభుత్వం కూడా ఈ విషయంలో అప్రమత్తంగానే ఉందని అనుకుంటున్నా.!
ఏప్రిల్ 1వ తేదీ గురువారం…జమ్మూకశ్మీర్ రాష్ట్రంలో పాక్ ప్రేరిత ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. జమ్మూకశ్మీర్ లోని నౌగామ్ కు చెందిన బీజేపీ నాయకుడిపై దాడికి యత్నించారు. ఈ దాడిలో ఓ పోలీసు కానిస్టేబుల్ మరణించాడు. నౌగామ్ , అరిగం ప్రాంత శివారల్లో బీజేపీ నాయకుడు అన్వర్ ఖాన్ ఇంటి వద్దకు వచ్చిన ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు.ఈ ఘటనలో ఇంటి వద్ద రక్షణ విధుల్లో ఓ పోలీసు కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డాడు. అక్కడ నుంచి ఉగ్రవాదులు ఎస్ఎల్ఆర్ రైఫిల్ తీసుకుని పారిపోయారు. ఈ ఘటనలో గాయపడిన సెంట్రీ పోలీసును ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందినట్లు హస్పిటల్ వర్గాలు తెలిపాయి.
ఉగ్రవాదులు జరిపిన ఈ దాడిని కశ్మీర్ బీజేపీ యూనిట్ తీవ్రంగా ఖండించింది. 2018లో కూడా అన్వర్ ఖాన్ పై ఇదే తరహాలో దాడి జరిగింది. ఆ ఘటనలో కూడా అతను తృటిలో తప్పించుకున్నాడు. కశ్మీర్ లోయలో రాజకీయ నాయకులపై దాడుల నేపథ్యంలో పోలీసులు వివిధ పార్టీల నాయకులకు రక్షణను మరింత కట్టుదిట్టం చేశారు.
ఆర్టికల్ 370 రద్దు తోపాటు జమ్మూకశ్మీర్ ను యూనియన్ టెరిటరీ మార్చిన తర్వాత… నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, కాంగ్రెస్ నాయకులకంటే కూడా లోయలో బీజేపీ నాయకులనే ఉగ్రవాదులు ఎక్కువగా టార్గెట్ చేశారని కొంతమంది విశ్లేషకులు అంటున్నారు.