National

మరో ముగ్గురు తీవ్రవాదులను అదుపులోకి తీసుకున్న ఉత్తరప్రదేశ్ ఏటీఎస్

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అల్-ఖైదాతో సంబంధం ఉన్న వ్యక్తుల వేట కొనసాగుతూ ఉంది. అల్-ఖైదాకు చెందిన కాశ్మీరీ విభాగానికి చెందిన అన్సర్ ఘజ్వత్-ఉల్-హింద్‌తో సంబంధం ఉన్న మరో ముగ్గురు నిందితులను ఉత్తర ప్రదేశ్ ఏటీఎస్ పట్టుకుంది. అంతకుముందు అరెస్టయిన ఇద్దరు ఉగ్రవాదులు విచారణ సమయంలో తమ సహచరుల పేర్లను వెల్లడించడంతో ఈ అరెస్టులు జరిగాయి. ఈ అరెస్టుకు సంబంధించిన ప్రెస్ నోట్ ను ఉత్తరప్రదేశ్ ఏటీఎస్ విడుదల చేసింది.

యుపి ఏటీఎస్ షకీల్ (35), మహ్మద్ ముస్తాకిమ్ (44), మహ్మద్ ముయీద్ (29) ను పోలీసులు కోర్టు అనుమతితో కస్టడీ లోకి తీసుకోనున్నారు. నిందితులు తమ నేరాలను అంగీకరించినట్లు తెలిపారు. వారి నుండి మరింత సమాచారం సేకరించే పనిలో ఉన్నారు. అరెస్టు చేసిన ఉగ్రవాదుల మొబైల్ ఫోన్ల నుంచి 12 అనుమానాస్పద వీడియోలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వీడియోలను పంపించిన వారి గురించి కూడా ఆరా తీస్తున్నారు. వీడియో యొక్క కంటెంట్ యువతను బ్రెయిన్ వాష్ చేయడానికి రూపొందించారని.. తీవ్రవాదం వైపు వెళ్లేలా ప్రణాళికలు రూపొందించారు. వారి కాల్ వివరాలు పరిశీలించగా ఢిల్లీ, మీరట్, హార్డోయి, బరేలీ, కాన్పూర్ లకు ఎక్కువ కాల్స్ వెళ్లినట్లు గుర్తించారు. వీటి ఆధారంగా ఏటీఎస్ మూడు కొత్త బృందాలను ఏర్పాటు చేసి ప్రత్యేక దర్యాప్తును ప్రారంభించింది. ఒక ఉగ్రవాది మినాజ్ నేపాల్ కేంద్రంగా ఉన్న ఇద్దరు వ్యక్తులతో నాలుగుసార్లు కాంటాక్ట్ అయినట్లు తెలుస్తోంది. అరెస్టు చేసిన ఉగ్రవాదులు వారి మోడస్ ఆపరేషన్ కు సంబంధించిన సమాచారాన్ని వెల్లడించారు. ఉగ్రవాదులు మొదట చాట్‌ల ద్వారా పరిచయాన్ని ఏర్పరుచుకుంటారు, స్థానికంగా విచారణ చేసి, వారికి పనులు కేటాయించే ముందు వారిని వ్యక్తిగతంగా కలుస్తారు.

జులై 11న ఇద్దరు తీవ్రవాదుల అరెస్టు:

జూలై 11 న, ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) లక్నోలో ఆల్ ఖైదాతో సంబంధిత ఇద్దరు ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరికీ ఉగ్రవాద సంస్థ అల్-ఖైదాతో సంబంధం ఉందని యుపిలోని ఎడిజి లా అండ్ ఆర్డర్ ప్రశాంత్ కుమార్ అన్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో విధ్వంసం సృష్టించేందుకు మానవ బాంబులుగా ట్రైనింగ్ తీసుకున్నట్టు సమాచారం ఉందని యాంటీ టెర్రరిజం స్క్వాడ్ వెల్లడించింది. ఆల్ ఖైదా అనుబంధ సంస్థ అన్సార్ గజ్వాట్ ఉల్-హింద్‌తో వీరికి సంబంధాలు ఉన్నాయని.. మిన్హాజ్ అహ్మద్, మజీరుద్దీన్ ఇద్దరు ఉగ్రవాదులు సహా ఏడుగురు ఇంట్లో ఉన్నట్టు సమాచారంతో ఏటీఎస్ బృందం దాడులు చేసింది. అయిదుగురు ఉగ్రవాదులు పారిపోగా ఇద్దరిని పట్టుకున్నట్టు చెప్పారు. ఇద్దరి నుంచి రెండు లైవ్ (ప్రెషర్ కుకర్) బాంబులు, డిటొనేటర్, 6 నుంచి ఏడు కిలోల పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వచ్చే ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు రాష్ట్రంలోని లక్నో సహా పలు నగరాల్లో ఉగ్రవాద చర్యలకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం అందడంతో దాడులు చేసినట్టు వెల్లడించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

1 × two =

Back to top button