హిజాబ్ వివాదంపై స్పందించిన అల్-ఖైదా

0
827

కర్ణాటకలోని ఉడిపిలో హిందూ విద్యార్థులను రెచ్చగొట్టేలా “అల్లాహు అక్బర్” అని అరిచిన బురఖా ధరించిన విద్యార్థిని బీబీ ముస్కాన్ జైనాబ్ ఖాన్‌ పై ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ అల్-ఖైదా చీఫ్ ప్రశంసలు కురిపించారు. కర్నాటక హిజాబ్ వివాదంపై అల్-ఖైదా స్పందించింది. అల్-ఖైదా అధికారిక షబాబ్ మీడియా విడుదల చేసిన తొమ్మిది నిమిషాల వీడియోలో, ఉగ్రవాద సంస్థ అల్-ఖైదా నాయకుడు ఐమాన్ అల్-జవహిరి, బురఖా ధరించిన విద్యార్థిని ముస్కాన్ ఖాన్‌ను ప్రశంసించారు. ఆమె హిజాబ్ నిరసనల సందర్భంగా ఉడిపిలో హిందూ విద్యార్థుల వద్ద “అల్లాహు అక్బర్” నినాదాలు చేసిన తర్వాత బాగా పాపులర్ అయింది. ముస్కాన్ జైనాబ్ ఖాన్‌ను వర్ణించే ఇన్ఫోగ్రాఫిక్‌ను కలిగి ఉన్న “ది నోబుల్ ఉమెన్ ఆఫ్ ఇండియా” అనే వీడియోలో, జవహిరి ఆమెను ప్రశంసిస్తూ తాను కంపోజ్ చేసిన పద్యాన్ని చదివాడు.

వీడియోలు, సోషల్ మీడియా ద్వారా ముస్కాన్ ఖాన్ గురించి తెలుసుకున్నానని జిహాదీ ఉగ్రవాదుల నాయకుడు చెప్పాడు. ముస్కాన్ ఖాన్‌ను ‘సోదరి’గా అభివర్ణించాడు. ఆమె చర్యలు తనను ఎంతగానో కదిలించిందని చెప్పాడు. ఆమె రెచ్చగొట్టే ఇస్లామిక్ నినాదాలతో ముగ్ధుడైన ఐమాన్ అల్-జవహిరి తాను ఒక పద్యం రాయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పాడు. భారత ప్రభుత్వం సాగిస్తున్న అణచివేత పై ప్రతిస్పందించాల్సిన అవసరం ఉందంటూ భారతీయ ముస్లింలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. జవహిరి పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లతో పాటు హిజాబ్‌ను నిషేధించిన దేశాలపై కూడా విమర్శలు చేశాడు.

ఐదు నెలల తర్వాత జవహిరికి సంబంధించిన మొదటి వీడియో. “మోస్ట్ వాంటెడ్” జెహాదీ టెర్రరిస్టులలో ఒకడైన అల్-జవహిరి సజీవంగా ఉన్నాడని, ప్రపంచవ్యాప్త వ్యవహారాలను తెలుసుకుంటూనే ఉన్నాడని అర్థమవుతోంది. 2020లో, జవహిరి మరణించాడని వార్తలు వచ్చాయి. కొన్ని నెలల తర్వాత, అతను జీవించి ఉన్నాడని సూచించే తేదీ లేని వీడియో బయటపడింది. అతను ఆఫ్ఘనిస్తాన్‌లో ఎక్కడో ఉన్నాడని భావిస్తున్నారు.

ఎవరీ ముస్కాన్ జైనాబ్ ఖాన్ ?

ముస్కాన్ జైనాబ్ ఖాన్ కర్ణాటకలోని మాండ్యాలోని పీఈఎస్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, సైన్స్ అండ్ కామర్స్ విద్యార్థిని. బురఖా ధరించి “అల్లాహు అక్బర్” అని ఇస్లామిక్ నినాదాలు చేయడం కనిపించిన తర్వాత ఆమె వెలుగులోకి వచ్చింది.

PES కళాశాల క్యాంపస్‌లో హిజాబ్- బురఖా ధరించిన ముస్లిం విద్యార్థుల విషయంలో నిరసన తెలుపుతున్న హిందూ విద్యార్థులకు వ్యతిరేకంగా “అల్లాహు అక్బర్” అని అని ముస్కాన్ జైనాబ్ ఖాన్ నినాదాలు చేసింది. ముస్కాన్ జైనాబ్‌కు ఆమె తండ్రి ద్వారా రాడికల్ ఇస్లామిక్ సంస్థ పీఎఫ్‌ఐతో సంబంధాలున్నట్లు ఆ తర్వాత వెల్లడైంది. బీబీ ముస్కాన్ జైనాబ్ PFI నాయకుడు అబ్దుల్ సుకూర్ కుమార్తె.

ఆమె చర్య పట్ల కొన్ని ముస్లిం గ్రూప్స్ ప్రశంసలు కురిపించడమే కాకుండా, బహుమతులు కూడా ఇవ్వడానికి సిద్ధమయ్యారు. మహారాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యే (బాంద్రా) జీషన్ సిద్ధిక్ మాండ్యాలోని ఆమె నివాసాన్ని సందర్శించి, ఆమె సాహసోపేతమైన చర్య కారణంగా ఖాన్‌కు ఐఫోన్, స్మార్ట్ వాచ్‌ను అందజేశారు. ముస్కాన్ ఖాన్‌కు ఇస్లామిక్ సంస్థ జమియత్ ఉలామా-ఇ-హింద్ కూడా 5 లక్షల రూపాయల నగదు బహుమతిని ప్రకటించింది.