More

    మరోసారి బీజేపీ ఎంపీ అర్వింద్ ఇంటి దగ్గర ఉద్రిక్తత

    ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇంటిపై టీఆర్ఎస్ కార్యకర్తులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్సీ కవితపై అర్వింద్ వివాదాస్పద వ్యాఖ్యలకు చేశారంటూ టీఆర్ఎస్ కార్యకర్తలు దాడులకు తెగబడ్డారు. బంజారాహిల్స్ లోని అర్వింద్ నివాసంలోకి చొరబడ్డ టీఆర్ఎస్ కార్యకర్తలు కిటికీల అద్దాలు పగులగొట్టారు. ఆయన ఇంటి ముందు దిష్టిబొమ్మ దహనం చేశారు.

    మరోసారి బంజారాహిల్స్లోని బీజేపీ ఎంపీ అర్వింద్ ఇంటి దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అర్వింద్ ఇంటిపై టీఆర్ఎస్ దాడికి నిరసనగా బీజేపీ కార్యకర్తలు భారీగా అక్కడికి చేరుకున్నారు. అక్కడి నుంచి టీఆర్ఎస్ భవన్కు నిరనస ర్యాలీకి ప్లాన్ చేయగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బీజేపీ నేతలు రోడ్డుపై బైఠాయించారు. ఈ నిరసనలో మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. అర్వింద్ ఇంటిపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ దాడిపై హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ కు ఫిర్యాదు చేయనున్నట్లు బీజేపీ నేతలు తెలిపారు.

    తన ఇంటిపై జరిగిన దాడిపై ఎంపీ ధర్మపురి అర్వింద్ స్పందించారు. ఎమ్మెల్సీ కవిత కులాహంకారంతో మాట్లాడుతోందని ఎంపీ ధర్మపురి అర్వింద్ విమర్శించారు. కేసీఆర్, కేటీఆర్, కవితలకు విపరీతంగా కులాహంకారం పెరిగిపోయిందని మండిపడ్డారు. తన ఇంట్లో విధ్వంసం సృష్టించి 70 ఏళ్ల తల్లిని బెదిరించి ఇతర మహిళలను కొట్టే హక్కు ఆమెకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. కవిత ఇష్టానుసారం వ్యవహరించేందుకు ఇది దొరల పాలన కాదని అన్నారు.

    Trending Stories

    Related Stories