భైంసాలో మరోసారి ఉద్రిక్తత..!పోలీసులు ఏం చేశారో తెలుసా..?

0
782

ముందు వెనుకలు ఆలోచించకుండా ఏ పని చేయరాదు. ఇది ఓ తెలుగు సామెత. పరుగెట్టి పాలు తాగేకంటే నిలబడి నీళ్లు తాగమని మరో సామెత వుంది. అబద్ధానికి తొందరెక్కువ, నిజానికి నిదానం ఎక్కువ. ఇలా ఎన్నో సామెతలు తొందరపాటు కూడదని తెలియజేస్తున్నాయి. అయితే, భైంసా పోలీసులు మాత్రం.. తొందర మంత్రాన్నే జపిస్తూ.. భక్తజనుల శాంతియుత ర్యాలీని చిందర వందర చేసేశారు.

ఇటీవల నిర్మల్ జిల్లా భైంసాలో దుర్గా నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరిగాయి. దుర్గామాత విగ్రహ నిమజ్జన సందర్భంగా.. అసంఖ్యాక హిందూ భక్తులు నిమజ్జన యాత్ర చేపట్టారు. పట్టణంలోని గడ్డెన్న ప్రాజెక్ట్ సమీపానికి ఊరేగింపు చేరుకుంది. వాహనాలపై వున్న భక్తులు మ్యూజిక్ రికార్డ్ లకు అనుగుణంగా స్టెప్స్ వేస్తూ, నృత్యాలు సాగిస్తున్నారు. దుర్గామాత జైజై నాదాలు చేస్తూ.. నృత్యాలు చేస్తూ నిమజ్జన యాత్రను సాగిస్తున్నారు. ఇంతలో పోలీసులు అక్కడకు వచ్చి అనవసర వాగ్వాదానికి దిగారు. కారణం లేకుండా తగవు దిగి.. శోభాయాత్రను వెంటనే పూర్తి చేసేయాలని హుకుం జారీ చేశారు.

ఏడాదికి ఒకసారి విజయదశమి వేడుకల్లో అమ్మవారి శోభాయాత్ర ఆర్భాటంగా చేయడం ఆనవాయితీ అని.. నిమజ్జన యాత్రను తూతూ మంత్రంగా పూర్తిచేయమనడం సరికాదని భక్తులు పోలీసులతో అన్నారు. అంతే.. పోలీసులకు తెగ కోపం వచ్చేసింది. భక్తులను ఇష్టానుసారం బాదేశారు. పోలీసు జులుంతో.. నలుగురు భక్తులు తీవ్రగాయాల పాలయ్యారు. పోలీసు దెబ్బలకు తలకు తీవ్ర గాయాలైన వ్యక్తిని భైంసాకు చెందిన విక్కిగా గుర్తించారు. నిమజ్జన ఊరేగింపును అడ్డుకోవడంతో భక్తుల నిరసనలు వెల్లువెత్తాయి. దుర్గాదేవి భక్తులు రోడ్డును దిగ్బంధించి నిరసన తెలిపారు.

ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడడంతో..పోలీసు శాఖ ఉన్నతాధికారులు, ఇతర శాఖల అధికారులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. పోలీసుల తీరును నిరసిస్తూ..భక్తులు నినాదాలు చేశారు. దీంతో, జిల్లా ఎస్పీ కిరణ్ కరే భక్తులకు నచ్చచెప్పి.. శాంతింప చేశారు. అనంతరం తిరిగి నిమజ్జన యాత్ర తిరిగి ప్రారంభం అయ్యింది.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

twelve − 7 =