ఆది కైలాష్ యాత్రకు వెళ్లిన నేషనలిస్టు కుటుంబానికి పరీక్ష పెట్టిన ప్రకృతి

0
1043

పవిత్ర ఆది కైలాష్ యాత్రకు వెళ్లాలని ప్రతి ఒక్క హిందువు భావిస్తూ ఉంటారు. అలా వెళ్లిన నేషనలిస్ట్ హబ్ కుటుంబానికి చెందిన వ్యక్తులకు ప్రకృతి పరీక్ష పెట్టింది. ఎన్నో ఆటంకాలు.. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొని ఉత్తరాఖండ్ లోని ఆది కైలాష్ యాత్రను పూర్తీ చేశారు. అక్కడ చోటు చేసుకున్న ఘటనలను కళ్లకు కట్టినట్టు వివరించారు.. బోయిన పల్లికి చెందిన టి.బాలాజీ. సంఘ్ పరివార్ కు చెందిన బాలాజీ.. తాము ఈరోజు సురక్షితంగా అక్కడి నుండి బయటపడ్డామంటే అందుకు ఆ ఈశ్వరుడి దయ మాపై ఉండడమే అని అన్నారు.

మొత్తం 24 మందితో కూడిన బృందంలో బాలాజీ కూడా ఉన్నారు. 15వ తేదీన ఆది కైలాష్ యాత్రకు బయలుదేరారు. బస్సులో దార్చులా వరకు చేరుకున్నారు. అక్కడే ఉన్న బేస్ క్యాంపు వద్ద ఉన్నారు. 19వ తేదీన ఆదికైలాష్ యాత్రకు బయలుదేరారు. వాతావరణం సహకరించకపోవడంతో ఆశ్రమంలో రెస్ట్ తీసుకున్నారు. ఇక 22 వ తేదీన ఆది కైలాష్ దర్శనం జరిగింది. అక్కడి నుండి తిరిగి బేస్ క్యాంపుకు చేరుకోవడానికి ప్రయత్నించే సమయంలో చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఎక్కడికక్కడ నిలిచిపోయిన ట్రాఫిక్.. కళ్ల ముందే కూలిపోతున్న కొండచరియలు. ఎలాగోలా రిటర్న్ లో రాత్రికి బూధికి చేరుకున్నారు. రోడ్డు పాడైపోయిందని భారతీయ ఆర్మీ చెప్పింది. వారిని తిరిగి పంపించడానికి ఆ రాత్రి అధికారులు ఒప్పుకోలేదు. తర్వాతి రోజు సాయంత్రం నాలుగు గంటలకు మమ్మల్ని పంపించడానికి ఒప్పుకున్నారు. ఆ ప్రాంతాల్లో భారత్ కు చెందిన సిమ్ కార్డులు పని చేయలేదు.. నేపాల్ కు చెందిన టెలీకాం ఆపరేటర్ల సిమ్ లు మాత్రమే పని చేస్తూ ఉంటాయట..! దార్చులాకు చేరుకునే రహదారిపై ఓ పెద్ద పర్వతానికి చెందిన ఓ భాగం కూలిపోయింది. మిలటరీ వాళ్ళు దార్చులాకు వెళ్ళడానికి ఏ మాత్రం అనుమతి ఇవ్వలేదు. బృందంలో ఉన్న కొందరికి ఆరోగ్యం సహకరించడం లేదు. మరికొందరిలో టెన్షన్ మొదలైంది. ఆ సమయంలో మా బృందంలో వ్యక్తులు.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో మాట్లాడారు. గుంజికి వెళ్ళండి అక్కడ హెలీప్యాడ్ ఉంటుందని ఆయన బృందం సూచించింది. ఎలాగోలా గుంజికి చేరుకున్న మాకు వాతావరణం కూడా పరీక్ష పెట్టింది. వాతావరణం ఏ మాత్రం బాగాలేదని హెలికాఫ్టర్ రాలేదు. ఎట్టకేలకు సోమవారం ఉదయం హెలికాఫ్టర్ వచ్చింది.. మొదట మహిళలను పంపించారు. మా బృందంలోని నలుగురు.. ఓపెన్ హార్ట్ సర్జరీ అయిన వ్యక్తిని పంపించేశారు. ఇక 12 మంది ఈరోజు ఉదయం దార్చులాకు చేరుకున్నాం. ఇంకా ఎనిమిది మంది రావాల్సి ఉంది. ప్రస్తుతం దార్చులాలో ఉన్నాం.. రోడ్లు అసలు బాగాలేవు.. పరిస్థితులు అనుకూలించగానే గమ్యస్థానాలకు చేరుకుంటామని బాలాజీ చెప్పుకొచ్చారు.

ఈ బృందానికి సంబంధించిన వివరాలివే:

01)బీరెల్లి రాధాకృష్ణ/వ్యాపారం

02)బీరెల్లి చంద్ర శేఖర్/వ్యాపారం

03)బీరెల్లి శ్రీకర్/ప్రైవేట్ ఉద్యోగి

04)బీరెల్లి రాకేష్/బిజినెస్ కన్సల్టెన్సీ సర్వీసెస్

05)మ్యాదం రాజేశ్వర్ గుప్తా/వ్యాపారం

06)భానూరి నర్సిములు/వ్యాపారం

07)శంకర్ భానూరి/వ్యాపారం

08)గౌరీ శెట్టి భిక్షపతి/వ్యాపారం

09)బీరెల్లి వేణుగోపాల్/వ్యాపారం

10)బీరెల్లి శ్రీనివాస్/వ్యాపారం

11)టాండిల్ బాలాజీ/వ్యాపారం

12)టాండిల్ ఆనంద్/ఆర్కిటెక్ట్

13)వుప్పలంచ మల్లికార్జున్/వ్యాపారం

14)చీటి ప్రేమ్ సాగర్ రావు/వ్యాపారం

15)రాంచంద్రారెడ్డి బాణాపురం/వ్యాపారం

16)యద్మ మాధవ రెడ్డి/వ్యాపారం

17)సాయినేని మురళీధర్ రావు/వ్యాపారం

18)కల్వకుర్తి శేఖర్/వ్యాపారం

19)కూర జయ దేవ్/ప్రిన్సిపాల్

20)సూరం వేణుగోపాల్/వ్యాపారం

21)రాజాగారి శ్రీనివాస్ రెడ్డి/వ్యాపారం

22)ఖోడే గోవర్ధన్/వ్యాపారం

23)రాజాగారి నవీన్ రెడ్డి/వ్యాపారం

24)వనమా శ్రీనివాస్ రావు/వ్యాపారం

యాత్ర సాగే ప్రాంతంలో కొండచరియలు విరిగి పడడంతో రహదారులన్నీ ఒక్కసారిగా బ్లాక్ అయిపోయాయని.. పలు ప్రాంతాల్లో కుంభవృష్టి కూడా పడిందని యాత్రకు వెళ్లిన వ్యక్తులు తెలిపారు.

6,310 మీటర్ల ఎత్తులో ఉన్న ఆది కైలాష్‌ను చిన్న కైలాసం అని కూడా పిలుస్తారు, ఇది కైలాష్ పర్వతానికి ప్రతిరూపం. ఇది ఇండో-టిబెటన్ సరిహద్దుకు సమీపంలో ఉత్తరాఖండ్‌లోని పితోరాఘర్ జిల్లాలో భారత భూభాగంలో ఉంది. ప్రశాంతమైన కుమాన్ హిమాలయాల వద్ద ఇది ఉంది.

ఆది కైలాష్ ఎలా చేరుకోవాలి:
ఈ ట్రెక్ కోసం బేస్ క్యాంప్ తవాఘాట్ అయినప్పటికీ దార్చులలో వసతి, ప్రాథమిక సౌకర్యాలను సులభంగా పొందవచ్చు.

విమాన మార్గం: పంత్‌నగర్ సివిల్ ఏరోడ్రోమ్ దార్చుల నుండి 301 కి.మీ దూరంలో ఉన్న సమీప విమానాశ్రయం.

రైలు మార్గం: పిథోరఘర్ నుండి 239 కి.మీ దూరంలో ఉన్న తనక్పూర్ సమీప రైల్వే స్టేషన్.

రోడ్డు మార్గం: ISBT న్యూ ఢిల్లీ నుండి చంపావత్, అల్మోరా, తనక్‌పూర్, కుమావోన్ ప్రాంతాలకు నేరుగా బస్సులు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ నుండి మీరు దార్చులకి స్థానిక టాక్సీలను అద్దెకు తీసుకోవచ్చు.