More

  మహా వసూల్ అఘాడీపై మౌనమెందుకు..?

  ఏ వార్తకు ప్రాధాన్యం ఉంటుంది.?  ఏ వార్తను ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం ఉంటుంది.?  అనే ప్రశ్నలు ఎదురైనప్పుడూ దేశ హితం అనే కోణం ముఖ్యభూమిక వహిస్తుంది.! నేషన్ ఇట్రస్ట్ విషయంలో కాంప్రమైజ్ కావద్దు..! కాకూడదు కూడా..!

  అయితే ఇక్కడ మన దేశంలోని మెయిన్ స్ట్రీమ్ మీడియా.., ఈ విషయానికి ఎంత వరకు ప్రాధాన్యం ఇస్తుందంటే.., నేడు చెప్పలేని పరిస్థితి నెలకొంది. పార్టీలు…, కొన్ని కార్పొరేట్ శక్తులు, ఇంకా కులమనే కోణం మీడియాను డామినేట్ చేస్తున్నాయనే విమర్శలు ఉన్నాయి.

  మన దేశంలోని మొయిన్ స్ట్రిమ్ మీడియా, కొంతమంది లుటియెన్స్ జర్నలిస్టులు, సోకాల్డ్ కాలమిస్టుల, సెలెక్టివ్ అప్రోచ్ కారణంగా జనంలోకి వెళ్లాల్సిన అసలు సిసలైన వార్తలకు తగిన స్పెస్ లభించడంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో మన ది గ్రేట్ తెలుగు మీడియా గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంతమంచింది. నేషన్ ఇట్రస్ట్ కన్నా కుటుంబ పార్టీల ఇట్రస్టుకు, ప్రాంతీయవాదానికి, వేర్పాటువాదానికి, తమ కులపోళ్లే పాలకులుగా ఉండాలనే కనిపించని కాంక్ష..,! పైగా దీనికి జర్నలిజమనే ముసుగు వేసి… మన తెలుగు మీడియా చానళ్లు, పేపర్లు ప్రసారం చేసే నెగటివ్ నెరెటివ్ వార్తలను చూసిన వెంటనే..ప్రజలకు కూడా ఇట్టే అర్థం అయిపోతుంది. ఎందుకంటే నెటిజన్లు సోషల్ మీడియాలో తమదైన కామెంట్లలో తెలుగు మెయిన్ స్ట్రిమ్ మీడియా చానళ్లను, పేపర్లను ఒక ఆట ఆడుకుంటున్నారు. 

  మన తెలుగు మీడియా దృష్టిలో హిందుత్వమంటే మతతత్వం..! కానీ తమ చానళ్ల డిబేట్లలో, అలాగే న్యూస్ ను ఫికప్ చేయడంలో ఇవి కులానికి ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తాయనే వారూ ఉన్నారు. అందుకే నేమో…! మెయిన్ స్ట్రిమ్ మీడియా ప్రసారం చేసే వార్తలు, డిబేట్ లను చూసే వారి సంఖ్య రోజు రోజుకు తగ్గితోందని కొంతమంది నెటిజన్లు వాపోతున్నారు.

  మన తెలుగు మీడియాలో కొంతమంది జర్నలిస్టులు…ఈ మధ్యనే ఉత్తరాఖండ్ కొత్త సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన తీరత్ సింగ్ పై ఫోకస్ పెట్టారు.!  గ్రామీణ నేపథ్యం నుంచి సీఎం స్థాయివరకు ఎదిగిన ఆయన్ను అదే పనిగా గత రెండువారాల నుంచి టార్గెట్ చేస్తున్నారని తెలుస్తోంది. సీఎం తీరద్ సింగ్ ప్రసంగిస్తున్నప్పుడు కొద్దిగా తడబడుతూ మాట్లాడుతున్నారు. దీంతో ఆయన తడబడుతూ చెప్పిన విషయాలకు పెడర్ధాలు తీసి…, వాటిని దేశ ప్రజలందరూ తప్పకుండా తెలుసుకోవాల్సిన ముఖ్యమైన వార్తలుగా ప్రసారం చేస్తున్నారు.

  మీకు తెలిసే ఉంటుంది.! టీడీపీ అధినేత…మాజీ సీఎం చంద్రబాబు రాజకీయ వారసుడు…ఇంకా ఆయన కుమారుడు లోకేష్ బాబు కూడా కొన్ని సార్లు మాట్లాడే సబ్జెక్ట్ డివియేట్ అవుతుంటారు. అయితే లోకేశ్ బాబు తడబడుతూ మాట్లాడిన వార్తలను..,  ఓ తెలుగు దిన పత్రిక ఇంకా, అదే పత్రికకు చెందిన చానల్ ట్రోల్ చేస్తూ వార్తలు రాసి ప్రసారం చేసింది.. అయితే లోకేశ్ బాబుకు మద్దతుగా… మరో రెండు పత్రికలు రంగంలోకి దిగాయి.! ఓ యువనాయకుడికి సంబంధించిన ప్రకటనలపై ఇలాగేనా రాస్తారా? ఇదేనా జర్నలిజం..? అంటూ కొత్తపలుకులతో నీతి సూత్రాలు వల్లేవేశాయి. మీడియా నైతిక సూత్రాలు, సుద్దులు చెప్పిన ఆ పత్రికలు ఇప్పుడు ఉత్తరాఖండ్ కొత్త సీఎం తడబడి మాట్లాడిన అంశాలను.., అదే పనిగా ఇష్యూ చేయడం వెనుక మతలేంటి? దీనిని ఎలా కోణంలో అర్థం చేసుకోవాలి?  

  ఉత్తరాఖండ్ సీఎం ప్రకటనలను హెడ్ లైన్ న్యూస్ గా ప్రసారం చేసిన ఈ తెలుగు పత్రికలు, మీడియా చానళ్లు.., ఎందుకనో కానీ… మహారాష్ట్ర హోం మినిస్టర్ పై వచ్చిన అవినీతి ఆరోపణలపై అంతే స్థాయిలో స్పందించలేకపోయాయి.!  బార్ అండ్ రెస్టారెంట్ల నుంచి  ప్రతి నెల రూ. వంద కోట్లు వసూలు చేయాలని హోంమినిస్టర్ అనిల్ దేశ్ ముఖ్ తమకు టార్గెట్ విధించాడని… సాక్షాత్తు పోలీసు కమిషనర్… ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉద్దవ్ ఠాక్రేకు లేఖ రాసిన విషయాన్ని మన తెలుగు మీడియా చానళ్లు, పత్రికలు లూప్ లైన్ వార్తగానే ఎందుకు ట్రీట్ చేశాయి.? ఒక రాష్ట్ర హోం మినిస్టర్ రూ. వంద కోట్లు వసూలు చేయాలని పోలీసులకు టార్గెట్ విధించడం మన తెలుగు పత్రికలకు,మీడియాకు సర్వసాధారణ విషయంగా తోచిందా?

  దేశ కార్పొరేట్ దిగ్గజమైన ముకేశ్ అంబానీ నివాసం సమీపంలో పేలుడు పదార్థాల వాహనం కేసును ఇప్పుడు ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో పోలీసు అధికారి సచిన్ వాజేను అరెస్టు చేయడంతో, అసలు డొంక కదులుతోన్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో ముంబై పోలీసు కమిషనర్ పరమ్ వీర్ సింగ్ పై కూడా బదిలీ వేటు పడింది. అతన్ని హోంగార్డ్స్ విభాగానికి ట్రాన్స్ ఫర్ చేసింది మహారాష్ట్ర ప్రభుత్వం.! అయితే ముంబైలోని బార్లు, హోటళ్లు, హుక్కా సెంటర్ల నుంచి నెలకు రూ. 100 కోట్లు వసూలు చేయాలని నిర్ధేసించారని., ఈ పనిని 16 ఏళ్ల క్రితం సస్పెండై.., మహారాష్ట్రలో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి ప్రభుత్వం కొలువుదీరగానే.., తిరిగి విధుల్లోకి చేరిన సచిన్ వాజేకు, ఆ రాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ ఈ పనిని అప్పగించారని ముంబై పోలీస్ కమిషనర్ తన లేఖలో బయటపెట్టాడు. అంతేకాదు వసూలు చేయాల్సిన బార్లు, హోటళ్ల రోజువారి టర్నోవర్ ను బట్టీ వాటిని ఏ,బీ,సీ కేటగిరీలుగా విభజించి..ఈ వసూళ్లకు పాల్పడినట్లు కొంతమంది హోటల్ వ్యాపారులు కూడా తెలిపినట్లు వార్తలు వచ్చాయి.

  దీనిపై మహారాష్ట్ర అంతటా ప్రజలు భగ్గుమంటున్నారు. రాష్ట్రమంతటా ర్యాలీలు ధర్నాలు నిర్వహిస్తున్నారు. కొందరైతే  నాగపూర్ లోని మహా హోం మినిస్టర్ దేశ్ ముఖ్ నివాసంపై దాడులకు యత్నించారు. విపక్ష బీజేపీ మహారాష్ట్ర హోంమంత్రి రాజీనామాకు డిమాండ్ చేస్తూ ఆందోళనలను మరింత ఉదృతం చేసింది. పోలీసు కమిషనర్ చేసిన ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు జరపాలని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ డిమాండ్ చేశారు.

  మరోవైపు ఈ వంద కోట్ల అక్రమ వసూళ్ల అంశం పార్లమెంటును సైతం తాకింది. ఈ అంశాన్ని మహారాష్ట్రకు చెందిన బీజేపీ నేత.. కేంద్ర మంత్రి ప్రకాశ్ జావదేకర్ రాజ్యసభలో లేవనెత్తారు.  దీనిపై సభలో గందరగోళం చెలరేగి రాజ్యసభ వాయిదా పడింది.  16ఏళ్లు సస్పెన్షన్‌లో ఉన్న సచిన్‌వాజేను ఉద్ధవ్‌ ఠాక్రే ప్రభుత్వం ఎలా తిరిగి విధుల్లోకి తీసుకుందని  మహారాష్ట్రకు చెందినస్వతంత్ర ఎంపీ నవనీత్‌ రవిరాణా ప్రశ్నించారు.

  ఇప్పుడు ఈ మొత్తం వ్యహారం మహారాష్ట్ర ప్రభుత్వంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.ఇది మొత్తంగా శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ ప్రభుత్వం పుట్టిముంచడం ఖాయమని కొంతమంది విశ్లేషకులు అంటున్నారు. అయితే మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కాపాడే బాధ్యతను భుజాలకేత్తుకున్న ఎన్సీపీ అధినేత శరద్ పవార్…దిద్దుబాటు చర్యలకు దిగినట్లు తెలుస్తోంది.

  మొత్తంగా ఇప్పుడు చెప్పండి! గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన బీజేపీ నేత తీరత్ సింగ్ ఉత్తరాఖండ్ సీఎంగా ప్రమాణస్వీకారం చేసి కనీసం రెండు వారాలు కూడా కాలేదు. కానీ అతని తడబాటు ప్రసంగాలకు పెడర్థాలు తీసి హెడ్డింగ్ పెట్టేసి నేషన్ వైడ్ గా ఇదే ప్రాముఖమైన వార్తగా ప్రసారం చేస్తున్న మీడియాకు.,   డైరెక్టుగా ఒక హోం మంత్రే నెలకు వంద కోట్లు వసూలు చేసి ఇవ్వండి అంటూ మాకు హుకుం వేశారని.. ఓ పోలీసు అధికారి రాసిన లేఖకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందా.? మరి మన తెలుగు మీడియాకు దేశ హితం కంటే కూడా ఇంకా ఎవరి హితం కోసం పనిచేస్తోంది.! తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆలోచించాల్సిన విషయం ఇది.!    

  Trending Stories

  Related Stories