పెట్రో ధరలపై తెలుగు మీడియా నిజాలు చెప్పడం లేదా?

0
876

ఇండియా…. యూనియన్ ఆఫ్ స్టేట్స్..! అని భారత రాజ్యాంగం చెబుతోంది. దేశంలో అన్ని రాష్ట్రాల మధ్య ఏకాత్మతా భావాన్ని పెంపోందించి…తద్వారా దేశంలో ఏకత్వాన్ని సాధించాలని భారత రాజ్యాంగ నిర్మాతలు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రాలకు స్వేచ్ఛనిస్తూనే… అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో బలమైన ప్రభుత్వాల ఏర్పాటునకు రాజ్యాంగంలో రూపకల్పన చేయడం జరిగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రాజ్యాంగబద్ధంగా అధికారాల పంపిణీ జరిగింది. దేశం మొత్తం పాలనకు సంబంధించిన అంశాలను కేంద్ర జాబితా, అలాగే రాష్ట్రాలకు సంబంధించి రాష్ట్ర జాబితా, ఇంకా ఉమ్మడి జాబితాగా భారత రాజ్యాంగం విభజించింది. 2003లో 88వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా సేవలపై పన్నును వందో అంశంగా కేంద్రజాబితాలో చేర్చడం జరిగింది.

కేంద్రమైనా, రాష్ట్ర ప్రభుత్వమైనా…రెండింటికి కూడా కలెక్టివ్ రెస్పాన్సిబులిటీ అనేది ఒకటి ఉంటుంది. ప్రజలు పన్నుల రూపంలో చెల్లించిన ధనంతోనే ప్రభుత్వం నడుస్తుంది. దేశ రక్షణ, సైన్యం, సంక్షేమ పథకాలు, మౌలిక వసతుల అభివృద్ధి తదితర పనులకు, ప్రజలు.. పన్నుల రూపంలో చెల్లిన ధనమే ఆధారం.! ఇదే వాస్తవం.! అయితే పన్నుల పెంపుల విషయంలో కొన్ని సార్లు కేంద్ర, రాష్ట్రాల మధ్య భేదాభిప్రాయాలు సహజం.! ఖజానాకు చేరిన ధనాన్ని.. ఫైనాన్స్ కమిషన్ సిఫార్సుల ఆధారంగా కేంద్ర, రాష్ట్రాలకు కేటాయింపులు జరుగుతాయి.

అయితే ఈ మధ్యకాలంలో పెట్రోల్ ఉత్పత్తుల ధరల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వాలు తమ కలెక్టివ్ రెస్పాన్సిబులిటీని మరిచిపోయి.., కేంద్ర ప్రభుత్వమే అంతా చేస్తోందని, రాష్ట్రాల పాత్ర నిమ్మిత్తమాత్రమేనని పచ్చి అబద్దాలను ఆడుతూ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రజల ముందు దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాయి.ఈ    బ్లెమ్ గేమ్ లో భాగంగా కుట్రపూరితమైన వితండావాదాన్ని, కట్టుకథలను తెరపైకి తీసుకువస్తున్నాయి.

ఇక రాష్ట్ర ప్రభుత్వాలు ఆడుతున్న ఈ బ్లేమ్ గేమ్ లో  తెలుగు మెయిన్ స్ట్రీమ్ మీడియా శిఖండి పాత్రను పోషిస్తున్నాయని చాలా మంది నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.  తమకు తామే ది గ్రేట్  తెలుగు దిన పత్రికలుగా చెప్పుకునే కులగజ్జి పత్రికలు… చంద్రనాడు, చంద్రజ్యోతి, ఇంకా తెలుగు మెయిన్ స్ట్రీమ్ మీడియా చానళ్లు,  అందులోనూ కులగజ్జి బాగా వంటబట్టించుకున్న చానళ్లు కేంద్రంలోని మోదీ సర్కార్ కుట్రపూరితంగా వ్యవహారిస్తున్నాయి.

రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న అసత్య ప్రచారాలకు బకాలూదుతూ కేంద్ర ప్రభుత్వంపై అదేపనిగా బురదజల్లుతున్నాయి. ఇంకా బాధాకరమైన విషయం ఏమిటంటే.. పెట్రోల్ ధరల పెంపుపై అన్ని విషయాలు తెలిసిన సీనియర్ జర్నలిస్టులు కూడా అసలు నిజాలు చెప్పడం లేదనే విమర్శలు ఉన్నాయి.  పెట్రోల్ పై కేంద్ర ప్రభుత్వమే కాదు, రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ప్రత్యేక ట్యాక్స్ విధిస్తున్నాయనే విషయాలను తెలుగు ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్పకుండా అర్థసత్యాలను చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ, వారిని కన్ఫ్యూజన్ కు గురిచేస్తున్నారు.

మరోవైపు  కేంద్రంలోని మోదీ సర్కార్ అంటే పడని లూటియన్స్ జర్నలిస్టులు, సోకాల్ సామాజిక కార్యకర్తలు, కుహనా మేధావులు, కాంగ్రెస్, కమ్యూనిస్టు, కుటుంబ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు, తుక్డే తుక్డే గ్యాంగులు…అదేపనిగా సోషల్ మీడియాలో పెట్రోధరలపై  ఫేక్ న్యూస్ ను, తప్పుదోవ పట్టించే వాల్ పోస్టర్లను పోస్టులు చేస్తున్నారు. వీరి అసలు లక్ష్యం.. కేంద్రంలోని మోదీ సర్కార్ పై నెగటివ్ నెరెటివ్ ను బిల్డప్ చేయడమేనని ఆ పోస్టులను చూస్తే ఇట్టే అర్థమైపోతుంది.

ఈ మూకల ఫేక్ న్యూస్ ట్రాప్ లోచదువుకున్నవారు సైతం కూడా పడిపోతున్నారు. కనీసం నిజాల నిజాలు బేరిజు వేసుకోకుండా., క్రాస్ చెక్ చేసుకోకుండానే.. కాపీ.., ఫార్వర్డులు చేస్తూ తమ అజ్ఞాన్ని బయటపెట్టుకుంటున్నారు. ఇంకా కొన్ని వాట్సాప్ గ్రూపులలో అయితే ఆఫ్ నాలెడ్జీతో మొండివాదనలు చేస్తున్నారువారు లేకపోలేదు.  

ఈ సమయంలో పెట్రో ధరల పెంపు వెనుక ఉన్న అసలు వాస్తవాలను ప్రజలకు చెప్పాల్సిన తెలుగు మెయిన్ స్ట్రీమ్ మీడియా నిజాలు చెప్పడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. నిజానికి మన దేశం చాలా మారిపోయింది. గతంలోలాగా  పెట్రో ధరలను.. ప్రజలు పట్టించుకోవడం లేదనేది వాస్తవం. గతంలో అయితే పెంచిన పెట్రోల్ ధరలు తెల్లవారు జాము నుంచే అమల్లోకి వస్తాయనే ఒక ప్రకటనతో… పెట్రోల్ బంకుల వద్ద హల్ చల్ ఉండేది. గంటల తరబడి పెట్రోల్ కోసం క్యూ లైన్ ఉండేవి. కొంతమంది అయితే అవసరానికి మించిన పెట్రోల్ ను ముందే కొని స్టోర్ చేసుకునేవారు.రాజకీయ పార్టీలు రోడ్ల మీదకు వచ్చి ధర్నాలు చేసేవి.? ఇప్పుడు అలాంటి దృశ్యాలు ఇప్పుడు ఎక్కడైనా మనకు కనిపిస్తున్నాయా? కాలం మారింది. భారత ప్రజల్లో వినియోగవాదం పెరిగింది. పెట్రో ధరలు పెరిగినా జనం పెద్దగా పట్టించుకోవడం లేదనేది నిజం.!

అయితే విపక్ష పార్టీలకు ఆందోళనలు చేసేందుకు, అధికార పార్టీలను విమర్శించేందుకు ఏదైనా సాకు కావాలి. రాజకీయ పార్టీల నేతలు తమ స్వార్థ రాజకీయాల కోసం పెట్రో ధరలపై ప్రజలను తప్పుదోవ పట్టించేలా కామెంట్లు చేస్తుంటారు. పెట్రో ధరలు పెరిగితే ప్రభుత్వాన్ని విమర్శించాలనే రాజకీయ అనివార్యతతో చేసే విమర్శలను అయితే మనం అర్థం చేసుకోవచ్చు.!కానీ దాన్నే మెయిన్ ఇష్యూగా మార్చేసి..ప్రాంతీయ కుటుంబ పార్టీలతోపాటు కాంగ్రెస్, కమ్యూనిస్టు వంటి రాజకీయ పార్టీలు పెట్రో ధరలపై రాజకీయం చేస్తున్నాయి.

పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయంటే … ఇందులో కేంద్రానికి ఎంత బాధ్యత ఉందో, రాష్ట్రాలకు సైతం సమాన బాధ్యత ఉంటుందనే విషయం మర్చిపోరాదు. ఎందుకంటే కేంద్రంతో పాటు, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్ పై విధించిన పన్నులతో భారీగానే ఆదాయాలు పొందుతున్నాయన్నది  నిప్పులాంటి నిజం.!

కానీ.. మన ది గ్రేట్ తెలుగు దినపత్రికల రిపోర్టర్లు, లైవ్ డిబేట్ లలో ఆవేశంతో ఊగిపోయే ఆంధ్రా అర్నాబ్ గోస్వామిలు,  ప్రాంతీయవేర్పాటువాద యాంకర్లు కమ్ జర్నలిస్టులు.., పెట్రోల్ ధరల పెరుగుదల విషయంలో కుట్రపూరితంగా కేవలం కేంద్రంపైనే నిందలు మోపుతున్నారు! అయితే కేంద్రంపై నిందలు మోపుతున్నారు సరే.., మరి రాష్ట్రా ప్రభుత్వాలు పెట్రోల్ కెమికల్స్ పై విధించిన ప్రత్యేక ట్యాక్సులను తగ్గించేందుకు ఎందుకు ముందుకు రావడం లేదని ప్రశ్నించే దమ్ము ధైర్యం మాత్రం వీరికి ఉండదు. ఇంకా అదేమంటే తమది మాత్రమే దమ్మున్న చానల్ అంటూ ఢంకా కొట్టుకుంటారు. ప్రభుత్వం ఊ కోడితే దానికి తందాన అంటూ, డిబేట్ లు నడపడమే వీరికి తెలుసనే విమర్శలు ఉన్నాయి.

గత నెల రోజులుగా పెట్రోల్ ధరలపై మోదీ సర్కార్ పై నిందలు మోపిన తెలుగు మీడియా..,  జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్ ను తీసుకువచ్చేందుకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయని ప్రశ్నించే ధైర్యం మాత్రం లేదు.

పెట్రోల్ పై ముఖ్యంగా రెండు రకాల పన్నులుంటాయి. ఒకటి ఎక్సైజ్ డ్యూటీ, ఇది కేంద్ర ప్రభుత్వం విధించే పన్ను. రెండు వ్యాట్.. ఇది రాష్ట్ర ప్రభుత్వం విధించే పన్ను. ఇవి కాకుండా రవాణా ఖర్చులు, డీలర్ కమిషన్ వగైరా వుంటాయి. ఉదాహరణకు ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 89.29 అనుకుంటే.. అందులో ఆయిల్ కంపెనీలు డీలర్లకు విక్రయించే ధర 32.10 డీలర్ల కమిషన్ 3.68. ఐతే లీటర్ పెట్రోల్ పై కేంద్రం విధించే సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ 32.90. కాగా ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం విధించే వ్యాట్‌ 20.61. మొత్తం కలిపితే ఢిల్లీలో లీటర్ పెట్రోల్ 89.29 రూపాయలకు లభిస్తుందన్నమాట.

అయితే, రాష్ట్ర ప్రభుత్వం విధించే వ్యాట్ కన్నా.. కేంద్రం విధించే ఎక్సైజ్ డ్యూటీయే అధికమనే వాదన వుంది. కానీ, ఇక్కడ మనం ఓ నిజం తెలుసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం విధించే ఎక్సైజ్ డ్యూటీలో 42 శాతం మళ్లీ రాష్ట్ర ప్రభుత్వాలకే చెల్లిస్తుంది. కానీ, రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేసే వ్యాట్ లో కేంద్రానికి పైసా వాటా కూడా వుండదు. అంటే లీటర్ పెట్రోల్ పై ఎక్సైజ్ టాక్స్ రూపంలో కేంద్రం తీసుకుంటున్న 32.90 రూపాయల్లో 13 రూపాయల 80 పైసలు తిరిగి రాష్ట్రానికే చెల్లిస్తుంది. అంటే లీటర్ పెట్రోల్ పై కేంద్రం వినియోగదారుడి నుంచి పన్ను రూపంలో వసూలు చేసేది 19 రూపాయల 10 పైసలు. ఇక రాష్ట్ర పన్ను విషయానికి వస్తే.. వ్యాట్ 20 రూపాయల 61 పైసలకు.. కేంద్రం ఇచ్చే ఎక్సైజ్ వాటా కూడా కలిపితే.. 34 రూపాయల 41 పైసలు అవుతుంది. అంటే ఢిల్లీలో లీటర్ పెట్రోల్ పై కేంద్రం పన్నురూపంలో 19 రూపాయల 10 పైసలు వసూలు చేస్తుంటే.. అక్కడి రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 34 రూపాయల 41 పైసలు వసూలు చేస్తుంది. ఇక్కడ ఇంకో విషయం కూడా తెలుసుకోవాలి. పెట్రోల్ పై రాష్ట్ర ప్రభుత్వాలు విధించే వ్యాట్ అన్ని రాష్ట్రాల్లో ఒకే విధంగా వుండదు. ఢిల్లీలో 30 శాతం వ్యాట్ విధిస్తే.. అదే తెలంగాణలో 35.20 శాతం వ్యాట్ వసూలు చేస్తున్నారు. అంటే తెలంగాణ ప్రభుత్వం.. పెట్రోల్ పై ఢిల్లీ ప్రభుత్వం కంటే ఎక్కువ వన్ను వసూలు చేస్తోందన్నమాట.

నిజానికి పెట్రోల్ ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలనే చాలా కాలంగా ఉంది. అరుణ్ జైట్లీ ఆర్ధిక మంత్రిగా ఉన్న సమయంలో మోదీ ప్రభుత్వం జీఎస్టీ పరిధిలో తీసుకువచ్చేందుకు మొదట ప్రయత్నిచింది.అయితే మద్యం అమ్మకాలతోపాటు, పెట్రోల్ పై తమకు వచ్చే ఇన్ స్టంట్ ఆదాయాన్ని కోల్పోతామని రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకించిన విషయం మర్చిపోరాదు. పెట్రోల్ ధరలపై చర్చ సందర్భంగా బీజేపీ ఎంపీ రాజ్యసభ సభ్యుడు సుశీల్ కుమార్ మోడీ మరోక ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. పెట్రోల్ పై విధించే  ట్యాక్స్ ను ఏ రాష్ట్రమూ వ్యతిరేకించలేదని, కావాలంటే జీఎస్టీ కౌన్సిల్ సమావేశాల ప్రొసీడింగ్స్ ను పరిశీలించుకోవాలని అన్నారు. జీఎస్టీ ఆమోదం కోసం జరిగిన కౌన్సిల్ సమావేశాల్లో బీహార్ ఉప ముఖ్యమంత్రి హోదాలో తాను పాల్గొన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 

కేంద్రం, రాష్ట్రా ప్రభుత్వాలు కలిసి పెట్రోల్ ఉత్పత్తులపై విధించిన పన్నుల ద్వారా రూ. 5 లక్షల కోట్ల ఆదాయం పొందుతున్నాయి. ఒకవేళా పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకుని వస్తే…, జీఎస్టీ లోని అత్యధికంగా ఉన్న 28 శాతం శ్లాబ్ లోకి దీనిని తీసుకుని రావాల్సి ఉంటుంది. అదే జరిగితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ. 2 లక్షల నుంచి 2.5 లక్షల కోట్ల మేర పన్ను ఆదాయాన్ని కోల్పోతాయి. ఈ విషయాలన్నీ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కానీ, మన తెలుగు మీడియా చెప్పదు గాక చెప్పదు..! సో.. తెలుగు రాష్ట్రాల ప్రజలారా అసలు నిజాలు తెలుసుకోండి. జాతీయవాద జర్నలిజాన్ని సమర్థించండి.! 

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

one + twelve =