More

    కొన్ని వందల సినిమాలకు ఎడిటర్‌గా పనిచేసిన గౌతంరాజు కన్నుమూత

    తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. కొన్ని వందల సినిమాలకు ఎడిటర్‌గా పనిచేసిన గౌతంరాజు కన్నుమూశారు. ఆయన వయసు 68 సంవత్సరాలు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం మరింత విషమించడంతో తుది శ్వాస విడిచారు. 15 జనవరి 1954లో మద్రాసులో గౌతంరాజు జన్మించారు. ఎడిటర్ గౌతంరాజుకు సంధ్య, సుమాంజలి అనే ఇద్దరు పిల్లలున్నారు. గౌతంరాజు ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చనిపోయినట్లు సమాచారం.

    ఆయన 1954 జనవరి 15న ఏపీలోని ఒంగోలులో రంగయ్య, కోదనాయకి దంపతులకు జన్మించారు. ప్రముఖ తెలుగు దర్శకుడు జంధ్యాల తొలి చిత్రమైన నాలుగు స్తంభాలాట చిత్రంతో గౌతం రాజు ఎడిటర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించారు. ఇక ఆ తర్వాత ఎన్నో చిత్రాలకు పనిచేశారు. గౌతంరాజు దాదాపుగా 850 సినిమాలకు ఎడిటర్‌గా పనిచేశారు. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, హిందీ చిత్రాలకు ఆయన ఎడిటర్‌గా పనిచేశారు. తెలుగులో సూపర్ హిట్ చిత్రాలైన చిరంజీవి ఖైదీ నెంబర్ 150, పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్, అల్లు అర్జున్ రేసుగుర్రం, బలుపు, బద్రీనాథ్, డాన్ శీను, వంటి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలకు ఆయన పనిచేశారు.

    గౌతం రాజు 68 ఏళ్ల వయసులో కిడ్నీ, శ్వాస సంబంధ సమస్యలతో మరణించారని తెలియడంతో.. తెలుగు సినీ పరిశ్రమలో ఒక్కసారిగా విషాదఛాయలు అలముకున్నాయి. గౌతం రాజు మృతి పట్ల పలువురు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.

    Trending Stories

    Related Stories