టీడీపీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్.. వారి పనేనా..?

0
825

తెలుగుదేశం పార్టీ ట్విట్టర్ అకౌంట్ హ్యాకింగ్ కు గురైంది. ట్విట్టర్ లో టీడీపీ అకౌంట్ కోసం టైప్ చేస్తే టైలర్ హాబ్స్ (Tyler Hobbs) అనే అకౌంట్ జైటీడీపీ హ్యాండిల్ తో ప్రత్యక్షమవుతోంది. ఆ ఖాతాలో టీడీపీ పోస్టులకు బదులుగా విజువల్ ఆర్ట్స్ కు చెందిన పోస్టులు కనిపించాయి. దీనిపై ఐటీడీపీ స్పందించింది. తెలుగుదేశం పార్టీ అధికారిక ట్విట్టర్ అకౌంట్ ను అధికార వైసీపీ మద్దతు ఉన్న నికృష్టపు శక్తులు హ్యాకింగ్ చేశాయని ఆరోపించింది. త్వరలోనే టీడీపీ అకౌంట్ ను పునరుద్ధరిస్తామని వెల్లడించింది. వైసీపీ పాలనపై టీడీపీ ట్విట్టర్ అకౌంట్ ద్వారా విమర్శలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఆ ట్విట్టర్ అకౌంట్ కాస్తా హ్యాకింగ్ కు గురైంది. ఈ హ్యాకింగ్ వైసీపీ పనే అని టీడీపీ నేతలు ఆరోపిస్తూ ఉన్నారు. టీడీపీ ట్విట్టర్ ఖాతాకు 5 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు.