కేసీఆర్‎పై తుషార్ పరువునష్టం కేసు..?!బెడిసికొడుతున్న ఫాంహౌజ్ ఫైల్స్..!

0
714

ఫాంహౌజ్ ఫైల్స్ కేసు మరో మలుపు తిరిగింది. కేరళకు చెందిన తుషార్ వెళ్లపల్లి.. సీఎం కేసీఆర్ తనపై చేసిన ఆరోపణలను తిప్పికొట్టారు. అంతేకాదు, ఆయన కేసీఆర్‎పై పరువు నష్టం దావా వేయనున్నట్టు కూడా వార్తలు వెలువడుతున్నాయి. దీంతో గులాబీ బాస్ దిక్కుతోచని స్థితిలో వున్నట్టు తెలుస్తోంది. మునుగోడు పోలింగ్ ముగిసిన వెంటనే.. ప్రెస్ మీట్ పెట్టి ఫాంహౌజ్ ఫైల్స్‎పై ప్రెస్‎మీట్ పెట్టి.. బీజేపీపై నిప్పులు చెరిగాడు. అంతకుముందు నుంచే రోజుకో వీడియో విడుదల చేయడం.. అందులో బీజేపీని దోషిగా చూపే ప్రయత్నం చేయడం.. వంటివాటితో డ్రామాను రక్తికట్టించే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో నిందితులు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే వ్యూహంలో భాగంగా అమిత్ షా, బీఎల్ సంతోష్ తో పాటు కేరళకు చెందిన బీడీజేఎస్ పార్టీ అధినేత తుషార్ వెళ్లపల్లితో కూడా సంప్రదింపులు జరిపినట్టు ఆరోపణలు చేశారు.

తుషార్ వెళ్లపల్లి పేరు గత సార్వత్రిక ఎన్నికల్లో బాగా ప్రాచుర్యం పొందింది. 2015 లో తాను స్వంతంగా పార్టీ పెట్టినా,.. 2019లో లోక్ సభ ఎన్నికల్లో వయనాడ్ నుంచి రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా పోటీ చేశారు. తాజాగా కేసీఆర్ విడుదల చేసిన వీడియోలను ప్రస్తావిస్తూ తుషార్ వెళ్లపల్లి పేరును కూడా వెల్లడించడంతో ఆయన స్పందించారు. ఆ వీడియోలకు తనకూ ఎటువంటి సంబంధమూ లేదన్నారు. అవన్నీ ఫేక్ అని నిర్దారించారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినట్టుగా చెబుతున్న సమయంలో తాను గుజరాత్‎లో ఉన్నట్లు కేసీఆర్ చెప్పారు కానీ,.. గత పదేళ్ళలో తాను గుజరాత్ కే వెళ్ళలేదని కుండబద్దలు కొట్టారు తుషార్. అయితే, కేసీఆర్ చేసిన ఈ అసత్య ఆరోపణలపై తుషార్ వెళ్లపల్లి పరువునష్టం దావా వేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. తాను చేసిన వ్యాఖ్యలపై కేసీఆర్ నుంచి ఎటువంటి స్పందనా లేకపోతే తెలంగాణ సీఎంను కోర్టు సాక్షిగా క్షమాపణలు చెప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని సమాచారం.

అయితే ఈ పొలిటికల్ హైడ్రామా అంతా మునుగోడు ఎన్నికల ముందు మొదలైంది. ఈ డ్రామాకు కర్త కర్మ క్రియ అంతా సీఎం కేసీఆరే నడిపారు. తమ ఎమ్మెల్యేలను కొంటున్నారని,.. తెలంగాణపై ఢిల్లీ నాయకులు దాడికి పాల్పడుతున్నారని ప్రజలను నమ్మబలికే ప్రయత్నం చేశారు. ఇందులో నలుగురు ఎమ్మెల్యేలతో పాటు ముగ్గురు మధ్యవర్తుల నాటకానికి తెరతీసిన కేసీఆర్ స్క్రిప్ట్ మాత్రం సరిగ్గా రచించలేకపోయారు. సమయాభావం వల్లనో లేక నిర్లక్ష్య ధోరణితోనో రచించిన ప్లాన్ అంతా బూడిదపాలైంది. దీంతో ఈ డ్రామాకు ఆదిలోనే హంసపాదు అన్నట్లు ప్రజల ముందు నవ్వులపాలైంది. నటుల ఎంపిక నుంచి స్క్రిప్ట్ అందించడం వరకు అడుగడుగునా సమస్యలే ఉండటంతో చివరికి కేసీఆరే ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈ డ్రామాను రోజుకో వీడియో మరుసటిరోజుకు ఆడియోలను రిలీజ్ చేస్తూ ఎన్నికల పోలింగ్ వచ్చే వరకూ ఆ హీట్ ను అలాగే కొనసాగించేలా బాగానే ప్రయత్నించారు కేసీఆర్.

అయితే ఎన్నికలయితే అయిపోయాయి. ఎన్నికల్లో ఎవరు గెలిచినా ఎవరు ఓడినా కేసీఆర్ మాత్రం భవిష్యత్తులో కేసుల్లో చిక్కుకునే అవకాశం ఉంది. డ్రామాలో సరిగ్గా రక్తికట్టకపోవడంతో పాటు అదంతా ఉత్తుత్తిదే అని చాలామంది అభిప్రాయపడుతున్నారు. దీంతో పాటు అందులో ఎన్నో లోటుపాట్లు ఉన్నాయి. బీజేపీ కూడా నిందితులకు తమకు ఎటువంటి సంబంధం లేదని ఆరోపణలు చేస్తోంది. అయితే ఆడియో టేపుల్లో బీజేపీ వ్యక్తుల పేర్లను కూడా తీసుకురావడంతో ఇది కేసీఆర్ కే వ్యతిరేకంగా మారే అవకాశం ఉంది. దీంతో పాటు అటు ఫాంహౌజ్ లో మొదట డబ్బుకట్టలు దొరికాయని.. 15 కోట్ల వరకు డబ్బు దొరికిందని ప్రచారం జరిగినా.. పోలీసులు మాత్రం ఎటువంటి డబ్బు సంచులూ చూపలేదు.

వీటన్నిటికి తోడు తాజాగా ఆడియో వీడియోల్లో ఉన్నవారు కూడా కేసీఆర్ కు వ్యతిరేకంగా కేసులు వేయడానికి పూనుకున్నట్టు వస్తున్న వార్తలతో.. ఇది ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి. పూర్తి విచారణ జరిగితే తప్ప ఇది బీజేపీ చేసిందో లేక టీఆర్ఎస్ పార్టీ చేసిందో తెలిసే అవకాశం లేదు.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

twelve − eight =