Telugu States

కాలికి గాయంతో కేటీఆర్

తెలంగాణ ఐటి, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పుట్టినరోజు రేపు. అయితే కేటీఆర్ ఎడమ కాలికి గాయమైందనే వార్త వచ్చింది. జారి పడడంతో ఎడమకాలి మడమ చీలమండలంలో క్రాక్ ఏర్పడింది. మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాల‌ని కేటీఆర్‌కు వైద్యులు సూచించారు. ఈ మేర‌కు కేటీఆర్ ట్వీట్ చేశారు. కింద ప‌డిపోయాను.. దీంతో ఎడ‌మ కాలి మ‌డ‌మ‌కు గాయ‌మైంది. మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలి. ఈ స‌మ‌యంలో విలువైన‌ ఓటీటీ షోలు చూడ‌టానికి స‌ల‌హా ఇస్తారా? అంటూ కేటీఆర్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.

అంతేకాకుండా కేటీఆర్ ఈసారి తన జన్మదిన వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో, ఇప్పటికే వరదల కారణంగా అనేక గ్రామాలు ముంపుకు గురైన పరిస్థితులలో జన్మదిన వేడుకలకు దూరంగా ఉండాలని కేటీఆర్ నిర్ణయించుకున్నారు.

Related Articles

Back to top button