More

    మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి చెందిన కంపెనీల్లో సోదాలు

    మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి చెందిన కంపెనీల్లో సోదాలు జరుగుతున్నాయి. బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని సుశీ ఇన్ ఫ్రాలో స్టేట్ జీఎస్టీ అధికారుల తనిఖీలు నిర్వహిస్తున్నారు. గత కొన్ని గంటలుగా ఈ సోదాలు జరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుశీ ఇన్ ఫ్రాతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. సుశీ ఇన్ ఫ్రా స్టేట్ జీఎస్టీ కింద కట్టాల్సిన పన్నులను ఎగ్గొట్టినట్లు ఆరోపణలు రావడంతో జీఎస్టీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి చెందిన సుశీ ఇన్‌ఫ్రాలో స్టేట్ జీఎస్టీ అధికారులు సోదాలు మధ్యాహ్నం నుండి కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. 20 మంది రాష్ట్ర జీఎస్టీ అధికారుల బృందం.. సుశీ ఇన్‌ఫ్రాలోని పలు రికార్డ్‌లను గత కొన్ని గంటలుగా తనిఖీ చేస్తున్నట్లు తెలుస్తోంది.

    సుశీ ఇన్ ఫ్రా ఎండీగా రాజగోపాల్ రెడ్డి కుమారుడు కోమటిరెడ్డి సంకీర్త్ రెడ్డి కొనసాగుతున్నారు. కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. సమీప ప్రత్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి చేతిలో 10 వేల పైచిలుకు ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. మునుగోడులో గతం కంటే ఎక్కువగా బీజేపీ ఓట్లు సాధించింది.

    Trending Stories

    Related Stories