More

  తెలంగాణ గవర్నర్ తమిళిసై సంచలన వ్యాఖ్యలు

  తెలంగాణ గవర్నర్ తమిళిసై సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ఫోన్లు ట్యాప్ అవుతున్నాయనే అనుమానం ఉందన్నారు. ఫామ్ హౌస్ కేసులోనూ రాజ్‎భవన్‎ను లాగాలని చూశారని అన్నారు. తుషార్ గతంలో తన ఏడీసీగా పనిచేశారని, ఉద్దేశపూర్వకంగా ఆయన పేరు తీసుకువచ్చారని చెప్పారు. రాజ్‎భవన్‎లో గవర్నర్ తమిళిసై మీడియాతో మాట్లాడారు. నాది ప్రగతిభవన్‎ కాదు రాజ్‎భవన్ అని, రాజ్‎భవన్‎కు ఎవరైనా రావొచ్చని, తమ సమస్యలు చెప్పుకొవచ్చని గవర్నర్ తెలిపారు. ఎవరొచ్చినా మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు.

  పెండింగ్ బిల్లులపై క్లారిటీ..
  బిల్లుల్ని తానే ఆపానని తప్పుగా అర్థం చేసుకున్నారన్నారు. బిల్లుల్ని సమగ్రంగా పరిశీలించేందుకు సమయం తీసుకున్నానని చెప్పారు. ఒక్కొక్క బిల్లును కూలంకషంగా పరిశీలిస్తున్నానని అన్నారు. ఈ సందర్భంగా బిల్లుల విషయంలో నాపై తప్పుడు ప్రచారం జరిగిందన్నారు. ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలని చెప్పాను. ఖాళీల విషయమై ప్రభుత్వానికి సమగ్ర నివేదిక ఇచ్చాను అని అన్నారు. కొత్తగా రిక్రూట్ మెంట్ బోర్డు ఎందుకు అని ప్రశ్నించానని, దానికి నేనేదో తప్పుదోవ పట్టిస్తున్నానని అనడం ఆశ్చర్యకరమన్నారు.

  ప్రొటోకాల్ వివాదంపై..
  కొంతమంది ప్రొటోకాల్ గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారని, తన పర్యటనలకు సంబంధించి పూర్తి వివరాలు ముందుగానే సంబంధిత అధికారులకు పంపించానని చెప్పారు. గతంలో తన పర్యటనల్లో ప్రొటోకాల్ పాటించని కలెక్టర్లు, ఎస్పీలపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందో చెప్పాలన్నారు. మీరు ప్రొటోకాల్ పాటించేవారైతే గవర్నర్‎కు స్వాగతం పలికేందుకు రాని అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోలేదన్నారు. కేవలం రాజ్‎భవన్ గౌరవాన్ని దిగజార్చేందుకే ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తోందన్నారు.

  Trending Stories

  Related Stories