More

    ఖైరతాబాద్ వినాయకుడికి తొలిపూజ చేసిన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్

    హైదరాబాద్ లో వినాయక చవితి సందడి మొదలైంది.. వినాయక చతుర్థి సందర్భంగా హైదరాబాద్ లోని ఖైరతాబాద్ మహాగణపతి భక్తుల కోసం కొలువుదీరాడు. ఈ ఉదయం తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఖైరతాబాద్ వినాయకుడికి తొలిపూజ నిర్వహించారు. గవర్నర్ కు పురోహితులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ ఉదయం పద్మశాలి సంఘం తరపున 50 అడుగుల జంధ్యం, కండువా, గరికమాల, పట్టువస్త్రాలను స్వామి వారికి సమర్పించారు.

    ఖైరతాబాద్ గణేశుడు ఈసారి ‘పంచముఖ లక్ష్మీగణపతి’గా దర్శనం ఇవ్వనున్నాడు. ఖైరతాబాద్ లో తొలిసారిగా మట్టితో చేసిన బొజ్జ గణపయ్య విగ్రహం ఏర్పాటు చేశారు. పంచముఖ మహాలక్ష్మి రూపంలో ఉన్న ఈ ఖైరతాబాద్ గణేశ విగ్రహం ఎత్తు 50 అడుగులు. లంబోదరుడికి కుడివైపున శ్రీ షణ్ముక సుబ్రహ్మణ్యస్వామి, ఎడమవైపున శ్రీ త్రిశక్తి మహాగాయత్రీ దేవి కొలువుదీరారు. ఈ భారీ విగ్రహం తయారీకి రూ.1.50 కోట్లు ఖర్చయినట్టు నిర్వాహకులు తెలిపారు. గణనాథుడిని దర్శించుకునేందుకు నేటి నుంచే భక్తులను అనుమతించనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు.

    spot_img

    Trending Stories

    Related Stories