Telugu States

మొదలైన మంకీపాక్స్ టెన్షన్.. తెలంగాణ ప్రభుత్వం హై అలర్ట్

దేశంలో మంకీపాక్స్ కలకలం మొదలైంది. ఇటీవల యూఏఈ నుంచి కేరళ వచ్చిన ఓ వ్యక్తిలో మంకీపాక్స్ లక్షణాలు కనిపించడంతో అతడిని ఓ ఆసుపత్రిలో ఐసోలేషన్‌లో ఉంచారు. అధికారులు అతడి నమూనాలు సేకరించి పూణెలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపగా.. అతడికి మంకీపాక్స్ సోకినట్టు నిర్ధారణ అయిందని కేరళ ఆరోగ్యమంత్రి వీణాజార్జ్ తెలిపారు. బాధితులు ఈ నెల 12న కేరళ చేరుకున్నట్టు మంత్రి తెలిపారు. వైరస్ నిర్ధారణ వార్తల నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ గైడ్ లైన్స్ విడుదల చేసింది. దేశీ ప్రయాణికుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. విదేశీ ప్రయాణికులకు దగ్గరికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంది. దేశీయ ప్రయాణికుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. విదేశీ ప్రయాణికులకు దగ్గరికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.విదేశాల నుంచి వచ్చిన వారికి ఎలాంటి అనారోగ్య సూచనలు ఉన్నా.. జంతువులతో కలిసి ఉన్న వారికి దూరంగా ఉండాలని తెలిపింది. చర్మ గాయాలు , జననేంద్రియ గాయాలు ఉన్నవారితో, అనారోగ్యంతో ఉన్న వ్యక్తులతో దూరం పాటించాలి. అడవి జంతువుల మాంసాన్ని లేదా వాటి నుంచి తయారుచేసిన ఎలాంటి ఉత్పత్తులను వాడవద్దన్నారు.

తెలంగాణ ప్రభుత్వం కూడా దీనిపై మరింత అప్రమత్తమైంది. సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రిలో మంకీపాక్స్‌ టెస్టులు చేయనున్నారు. వైద్యశాఖ భారీసంఖ్యలో పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. పూణె వైరాలజీ ల్యాబ్‌ నుంచి టెస్టింగ్‌ కిట్లను తెప్పిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. అవి రాగానే ట్రయల్‌ రన్స్‌ ప్రారంభించేందుకు అన్నిఏర్పాట్లు పూర్తిచేసింది. కరోనా ఆర్టీపీసీఆర్‌ టెస్టుల మాదిరిగానే మంకీపాక్స్‌ టెస్టులు చేయనున్నారు. బ్లడ్‌, స్వాబ్‌, స్కిన్‌పై ఉన్న నీటిబుడగల నుంచి శాంపిల్స్‌ సేకరించనున్నారు. మంకీపాక్స్‌ అనుమానితుల నుంచి శాంపిల్స్‌ తీసుకునేందుకు వైద్యశాఖ సిద్ధంగా ఉందని అధికారులు తెలిపారు.

Related Articles

Back to top button