More

    తెలంగాణ ఎంసెట్ పరీక్షల హాల్ టికెట్ల విడుదల

    తెలంగాణలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎంసెట్ పరీక్షల హాల్ టికెట్లను విడుదల చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి తెలిపింది. విద్యార్థులు తమ హాల్ టికెట్లను eamcet.tsche.ac.in వెబ్ సైట్ లింకు ద్వారా డౌన్ లోడ్ చేసుకోవచ్చని ఉన్నత విద్యామండలి సూచించింది. జులై 11వ తేదీ వరకు వెబ్ సైట్లో హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయి. తెలంగాణ ఎంసెట్ పరీక్షలు ఆగస్టు 14, 15, 18, 19, 20 తేదీల్లో నిర్వహించనున్నారు. ఎంసెట్ దరఖాస్తుల స్వీకరణ మే 28తో పూర్తయింది. ఆలస్య రుసుంతో అభ్యర్థులు జులై 7వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించారు.

    Related Stories