Telugu States

రాజగోపాల్‌ రెడ్డికి షోకాజ్ నోటీసులు రాబోతున్నాయా..?

కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలు సంచలనం అయిన సంగతి తెలిసిందే. తాను కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశానని… మర్యాదపూర్వకంగానే ఆయనను కలిశానని చెప్పారు. బీజేపీకి అనుకూలంగా కోమటిరెడ్డి మాట్లాడుతుండటంతో కాంగ్రెస్ అధిష్ఠానం అలర్ట్ అయింది. కోమటిరెడ్డి వ్యవహారం గురించి ఆరా తీస్తోంది. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి మాణికం ఠాగూర్ రంగంలోకి దిగి.. రాజగోపాల్ రెడ్డి నిన్న మీడియాతో మాట్లాడిన వీడియో క్లిప్లింగ్ లను తెప్పించుకున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి, పార్టీపై సాగర్ ఉప ఎన్నిక సమయంలో రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యల క్లిప్పింగ్స్ ను కూడా తీసుకున్నారు. రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై ఆయన సోదరుడు, కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇప్పటివరకు స్పందించకపోవడాన్ని కూడా పార్టీలోని కొందరు నేతలు తప్పుబడుతున్నారు. త్వరలోనే రాజగోపాల్‌ రెడ్డికి షోకాజ్ నోటీసు జారీ చేసే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి.

రాజగోపాల్ రెడ్డి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ తాను పార్టీ మారుతానని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాను గతంలో బీజేపీకి అనుకూలంగా ప్రకటనలు చేసిన మాట వాస్తవమేనన్నారు. బీజేపీలో చేరిక గురించి ఎప్పుడూ కూడా ప్రకటించలేదన్నారు. తనకు నిలకడ ఉంది కాబట్టే కాంగ్రెస్ లో ఉన్నానని ఆయన చెప్పారు.కాంగ్రెస్ పార్టీ బాగుపడాలనే ఉద్దేశ్యంతోనే తాను కొన్ని మాటలు మాట్లాడినట్టుగా ఆయన వివరించారు. తాను పార్టీ మారాల్సి వస్తే ప్రజలకు చెప్పే నిర్ణయం తీసుకొంటానని ప్రకటించారు.

Related Articles

Back to top button