Telugu States

గోదావ‌రి న‌దికి సీఎం కేసీఆర్ శాంతి పూజ.. వరదలపై సంచలన వ్యాఖ్యలు

గోదావరి వరదల వెనుక కుట్రలు ఉన్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలు చేశారు. క్లౌడ్ బరస్ట్ జరిగిందని అనుమానం వ్యక్తం చేశారు. ఇరత దేశాల వాళ్లు కుట్రలు చేస్తున్నారని.. గతంలో లేహ్‌లో, ఉత్తరాఖండ్‌లో ఇలాగే క్లౌడ్ బరస్ట్ చేశారని ఆరోపించారు. ఇప్పుడు గోదావరి పరివాహక ప్రాంతాల్లో క్లౌడ్ బరస్ట్ చేస్తున్నట్లుగా తమకు సమాచారం వచ్చిందని కేసీఆర్ అన్నారు. ఈ నెల 29 వరకు వర్షాలు పడతాయని వాతావరణశాఖ చెబుతోందని, ప్రమాదం తప్పిందని అనుకోవద్దని అధికారులకు సూచించారు. వరద బాధితులకు తక్షణ సాయం కింద కుటుంబానికి రూ.10 వేలు అందిస్తామన్నారు. బాధిత కుటుంబాలకు రెండు నెలలు 20 కేజీల చొప్పున ఉచిత బియ్యం అందిస్తామని కేసీఆర్ తెలిపారు. భద్రాచలం ముంపు బాధితులకు శాశ్వాత కాలనీలు నిర్మిస్తామని, ఎత్తైన ప్రదేశంలో కాలనీల నిర్మాణం చేపడతాన్నారు.

ఉప్పొంగి ప్ర‌వ‌హిస్తున్న గోదావ‌రి న‌దికి సీఎం కేసీఆర్ శాంతి పూజ నిర్వ‌హించారు. వంతెన పైనుంచి గోదావ‌రి ప‌రిస‌రాల‌ను సీఎం ప‌రిశీలించారు. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రులు పువ్వాడ అజ‌య్ కుమార్, హ‌రీశ్‌రావు, ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు, స‌త్య‌వతి రాథోడ్‌తో పాటు ప‌లువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

Related Articles

Back to top button