More

    మునుగోడులో నేడు సీఎం కేసీఆర్ సభ.. ఆ విషయంపై ఉత్కంఠ

    మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సభలో పాల్గొననున్నారు. ఆదివారం చండూరులో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది టీఆర్‌ఎస్‌. టీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్య­మంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఈ సభను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. మండల కేంద్రంలోని బంగారిగడ్డ ప్రాంతంలో 30 ఎకరాల విస్తీర్ణంలో సభ ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉప ఎన్నిక షెడ్యూల్‌ వెలువడక ముందే ఆగస్టు 20న మునుగోడు నియో­జకవర్గ కేంద్రంలో జరిగిన బహిరంగ సభలో కేసీఆర్‌ పాల్గొన్నారు. మరో సభను చండూరులో ఏర్పాటు చేస్తామని కేసీఆర్‌ గతంలోనే ప్రకటించారు. ఈ నేపథ్యంలో సభను విజయవంతం చేసేందుకు టీఆర్‌ఎస్‌ యంత్రాంగం కసరత్తు పూర్తి చేసింది. జన సమీకరణకు సంబంధించి ఇప్పటికే మునుగోడు ఉప ఎన్నికలో మండల ఇన్‌చార్జీలుగా వ్యవహరిస్తున్న మంత్రులకు బాధ్యతలు అప్పగించారు.

    తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకున్న తాజా రాజకీయ పరిణామాలతో చండూరు సభకు ప్రాధాన్యత ఏర్ప­డింది. ఫామ్ హౌస్ లో ఎమ్మెల్యేల వ్యవహారంపై కేసీఆర్‌ ఇప్పటివరకు స్పందించలేదు. చండూరు సభలో కేసీఆర్ ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారనే ఉత్కంఠ నెలకొంది. ఫామ్ హౌస్ వ్యవహారానికి సంబంధించిన నలుగురు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు చండూరు సభకు సీఎం కేసీఆర్‌తో పాటు హాజరవుతారని టీఆర్‌ఎస్‌ వర్గాలు అంటున్నాయి.

    Trending Stories

    Related Stories