అర్ధరాత్రి బీజేపీ నేత జిట్టా బాలకృష్ణ అరెస్ట్

0
878

తెలంగాణ ఉద్యమకారుడు, బీజేపీ నాయకుడు జిట్టా బాలకృష్ణా రెడ్డి అరెస్టయ్యారు. అర్ధరాత్రి ఆయన్ను పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. జిట్టా వెళుతున్న వాహనాన్ని సినిమా ఫక్కీలో ఛేజ్ చేసి మరీ ఘట్ కేసర్ టోల్ గేట్ సమీపంలో అదుపులోకి తీసుకున్నారు రాచకొండ పోలీసులు. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున అమరుల యాదిలో ఉద్యమ ఆకాంక్షల సాధన సభ నిర్వహించారు జిట్టా బాలకృష్ణ రెడ్డి. ఆ సభలో కేసీఆర్ ను కించపరిచే విధంగా స్కిట్ వేయించారని జిట్టా పై ఫిర్యాదు చేశారు టిఆర్ఎస్ నేతలు. దీంతో జిట్టాపై కేసు నమోదు చేశారు. ఈ కేసులోనే జిట్టాను అరెస్ట్ చేశారు పోలీసులు. తన అరెస్ట్ సమయంలో పోలీసులను నిలదీశారు జిట్టా బాలకృష్ణ రెడ్డి. ఎలాంటి నోటీసులివ్వకుండా అదుపులోకి తీసుకోవడమేంటని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమకారులు ప్రజాస్వామ్యబద్దంగా సభలు, సమావేశాలు కూడా నిర్వహించుకునే హక్కులేదా? అని నిలదీశారు.

జిట్టాను అర్దరాత్రి పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నోటీసులివ్వకుండా అర్దరాత్రి హంతకుడు, దోపిడీ దొంగల మాదిరిగా కిడ్నాప్ చేశారని మండిపడ్డారు. వెంటనే జిట్టా బాలకృష్ణారెడ్డిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేనట్లయితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారాయన,. లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు వుంటాయని హెచ్చరించారు బండి సంజయ్.