యాదాద్రి పర్యటన.. బండి సంజయ్ ను అడ్డుకున్న పోలీసులు

0
810

మొయినాబాద్‌ ఫాంహౌస్ ఎపిసోడ్లో తన పాత్ర లేదని లక్ష్మీనరసింహస్వామి సాక్షిగా ప్రమాణం చేయాలని సీఎం కేసీఆర్కు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. పోలీసులు అడ్డుకున్నా సరే వెళ్లి తీరుతామని ఆయన స్పష్టం చేశారు.

యాదాద్రిలో ప్రమాణం చేయడానికి వెళుతున్న బండి సంజయ్ ను పోలీసులు అడ్డుకున్నారు. కుట్రతో సంబంధం లేకుంటే యాదగిరిగుట్టకు వచ్చి ప్రమాణం చేయాలని, కేసీఆర్ కోసం యాదాద్రి ఆలయం వద్దకు వెళుతున్నట్లు బండి స్పష్టం చేశారు. బండి సంజయ్ పర్యటనకు అనుమతి లేదంటున్నారు పోలీసులు. పోలీసులు అడ్డుకున్నా వెళ్లి తీరుతానంటున్నారు బండి సంజయ్. శాంతిభద్రతల దృష్ట్యా బండి సంజయ్ ను యాదాద్రికి అనుమతించడం లేదని పోలీసులు చెబుతున్నారు.