More

    మహిళా కమిషన్ ముందుకు బండి సంజయ్..!

    ఎమ్మెల్సీ కవితపై వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాష్ట్ర మహిళా కమిషన్ ముందు హాజరయ్యారు. కవితపై చేసిన వ్యాఖ్యలపై మహిళా కమిషన్ కు బండి సంజయ్ వివరణ ఇచ్చారు. మరో వైపు ఎమ్మెల్సీ కవితకు బండి సంజయ్ క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. కొద్దిరోజుల కిందట ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణపై స్పందించిన బండి సంజయ్… తప్పు చేసిన వారిని అరెస్ట్ చేయక ముద్దు పెట్టుకుంటారా అని కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలను రాష్ట్ర మహిళా కమిషన్ సీరియస్‌గా తీసుకుంది. కేసును సుమోటోగా తీసుకున్న రాష్ట్ర మహిళా కమిషన్ ఈ నెల 13న హాజరవ్వాలంటూ నోటీసులు జారీ చేసింది. పార్లమెంటు సమావేశాల కారణంగా 18న హాజరవుతానని ఆయన కమిషన్‌ను కోరారు. ఆయన చెప్పినట్లుగానే నేడు విచారణకు హాజరు అయ్యారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

    Trending Stories

    Related Stories