More

    శవం వస్తే ఆ మసీదును మీకు.. శివలింగం వస్తే మాకు: బండి సంజయ్

    హనుమాన్ శోభాయాత్ర సందర్భంగా తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ.. తెలంగాణలో ఉన్న మసీదులన్నింటినీ తవ్వాలని డిమాండ్ చేశారు. తవ్వకాల్లో శవం వస్తే ఆ మసీదును మీకే వదిలేస్తామని, శివలింగం వస్తే మేము తీసుకుంటామని అన్నారు. ఉత్తరప్రదేశ్ లోని వారణాసి జ్ఞానవాపి మసీదులో శివలింగం బయటపడిందని బండి సంజయ్ చెప్పారు. ఇక్కడున్న మసీదులను తవ్వినా శివలింగాలు వస్తాయని అన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని మదర్సాలను మూసేస్తామని.. మైనార్టీ రిజర్వేషన్లను రద్దు చేస్తామని చెప్పారు. రాష్ట్రానికి పట్టిన శనిని వదిలిస్తామని, రామరాజ్యాన్ని స్థాపిస్తామని అన్నారు. తెలంగాణలో గతంలో వేలాది ఆలయాలను ధ్వంసం చేసి మసీదులు నిర్మించారన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని మదర్సాలను రద్దు చేస్తామని ప్రకటించారు. మైనారిటీ రిజర్వేషన్లను రద్దు చేసి ఆ రిజర్వేషన్లను ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీలకు వర్తింపజేస్తామని ప్రకటించారు. ఇప్పటివరకు తెలంగాణలో అధికారిక భాషగా ఉన్న ఉర్దూపై ఇక శాశ్వతంగా నిషేధం విధిస్తామని అన్నారు. నాలో ఊపిరి ఉన్నంతవరకు తెలంగాణలో ఉన్న హిందూ సమాజాన్ని సంఘటితం చేసి ఒక్కతాటిపైకి తీసుకొచ్చేందుకు పోరాడుతూనే ఉంటానని బండి సంజయ్ అన్నారు. నన్ను కన్న నా కరీంనగర్‌, నన్ను గెలిపించిన కరీంనగర్ ప్రజలకు శతకోటి వందనాలు. ఆ శ్రీ రాముడికి హనుమంతుడు ఎలాగైతే చేదోడుగా వాదోడుగా ఉన్నాడో అలాగే ఈ కరీంనగర్ ప్రజలకు ఏ ఆపదొచ్చినా వారికి రక్షణ కవచంగా నేనుంటా అని కరీంనగర్ ప్రజలకు బండి సంజయ్ హామీ ఇచ్చారు.

    Trending Stories

    Related Stories