తెలంగాణలో స్కూల్స్ బంద్.. ఆంధ్రప్రదేశ్ పరిస్థితిపై క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం

0
723

ఏ రోజుకారోజు తగ్గినట్లే తగ్గి మళ్లీ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న వేళ.. పలు రాష్ట్రాల మళ్లీ లాక్ డౌన్ దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో స్కూళ్లు, కాలేజీలను మూసివేశారు. మరికొన్ని ప్రాంతాల్లో ఆంక్షలు విధించారు. మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో నైట్ లాక్ డౌన్, కర్ఫ్యూ వంటి చర్యలు తీసుకుంటున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల పరిస్థితి కూడా అలానే ఉందనిపిస్తోంది.

సంవత్సరం దాటినా.. పలు దేశీయ.. విదేశీయ వ్యాక్సిన్ లు వచ్చిన మహమ్మారి కరోనా గురించి మాట్లాడకుండా.. దానికి సంబంధించిన వార్తాంశాలను ప్రజలకు చెప్పాల్సిన అవసరం లేకుండే ఉండే పరిస్థితి ఇంకా రాలేదనే చెప్పాలి. ఏ రోజుకారోజు తగ్గినట్లే తగ్గి మళ్లీ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న వేళ.. పలు రాష్ట్రాల మళ్లీ లాక్ డౌన్ దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో స్కూళ్లు, కాలేజీలను మూసివేశారు. మరికొన్ని ప్రాంతాల్లో ఆంక్షలు విధించారు. మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో నైట్ లాక్ డౌన్, కర్ఫ్యూ వంటి చర్యలు తీసుకుంటున్నారు.

ఇక తెలుగు రాష్ట్రాల పరిస్థితి కూడా అలానే ఉందనిపిస్తోంది. తెలంగాణలో మెడికల్ కాలేజీలు తప్ప మిగిలిన విద్యాసంస్థలన్నీ ఇప్పటికే మూసివేశారు. మళ్లీ ప్రభుత్వం చెప్పేవరకు విద్యాసంస్థలు తెరవొద్దని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలిచ్చింది. దీంతో ఆంధ్రప్రదేశ్ లోనూ విద్యాసంస్థలు మూసివేస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఐతే ఈ వార్తలపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వివరణ ఇచ్చారు. రాష్ట్రంలో స్కూళ్లను మూసివేసే ఆలోచన లేదని ఆయన స్పష్టం చేశారు. అలాగే ఆన్‍లైన్‍లో విద్యా బోధన ప్రసక్తే లేదని.. ఆన్‍లైన్ క్లాస్‍ల వల్ల ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులు ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. స్కూళ్లలో కరోనా వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకుంటామని.. విద్యార్థులు, తల్లిదండ్రులు భయపడాల్సిన అవసరం లేదన్నారు.

కాగా ఏప్రిల్ 1 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించనున్నట్లు ఏపీ ప్రభుత్వం  ప్రకటించింది. 1వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఒక్కపూటే తరగతుల నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఉదయం 7.45 నుంచి 11.30 వరకు మాత్రమే తరగతులు నిర్వహించనున్నారు.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

13 − three =