More

    దూకుడు పెంచిన బీజేపీ.. 119 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఇంచార్జీలు

    తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఇంచార్జీలను నియ‌మిస్తూ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ పూర్తి స్థాయి జాబితా విడుద‌ల చేశారు. వ‌చ్చే ఏడాది డిసెంబ‌ర్‌లోగానే తెలంగాణ అసెంబ్లీకి ఎన్నిక‌లు జ‌ర‌గాల్సి ఉంది. ఈసారి కూడా తెలంగాణలో ముందస్తుకు వెళతారో లేదో తెలియాల్సి ఉంది.

    బండి సంజయ్ మాట్లాడుతూ.. ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడుతోంది టీఆర్ఎస్ ప్రభుత్వమేనన్నారు. ఇజ్రాయెల్ నుంచి స్పైవేర్‌లు కొనుగోలు చేశారని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసీఆర్‌కు వెన్నతో పెట్టిన విద్య అన్నారు. లిక్కర్ స్కామ్ విషయంలో కేసీఆర్ ఎందుకు స్పందించలేదు? అని ఆయన స్పందించారు. కేసీఆర్ మౌనంగా ఉన్నారంటే స్కామ్‌ను ఒప్పుకున్నట్లేనన్నారు. మునుగోడులో ఒక్కొక్కరికి రూ.40 వేలు పంచడానికి టీఆర్ఎస్ సిద్ధమైందని ఆరోపించారు.

    Trending Stories

    Related Stories