More

    బీజేపీ లోకి తీన్మార్ మల్లన్న

    తీన్మార్ మల్లన్న.. తెలంగాణ ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు..! ఇప్పుడు ఆయన పొలిటికల్ జర్నీపై ఆసక్తికర వార్త బయటకు వచ్చింది. క్యూన్యూస్ చీఫ్ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ బీజేపీలో చేరనున్నారని ఆయన సొంత చానల్ క్యూ న్యూస్ అధికారికంగా తెలిపింది. మోదీ సిద్ధాంతాలకు ఆకర్షితులై బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది.

    పలు కేసులు ఎదుర్కొంటూ తీన్మార్ మల్లన్న జైలులో ఉన్నారు. ఆయనను విడుదల చేయించేందుకు ఆయన భార్య మమత ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ నడ్డాకి లేఖలు రాయడం సంచలనంగా మారింది. జేపీ నడ్డాకు తీన్మార్ మల్లన్న భార్య ముత్తమ్మ లేఖ రాశారు. తీన్మార్ మల్లన్న బీజేపీలో చేరుతారని ఆమె తెలిపారు. కేసీఆర్ అవినీతి అరాచకాలపై కొన్నేళ్లుగా మల్లన్న పోరాడుతున్నారని, అందుకే మల్లన్నపై అక్రమ కేసులు పెట్టి వేధించే ప్రయత్నం చేస్తున్నారని ముత్తమ్మ అన్నారు. కేసీఆర్ అరాచకానికి చరమ గీతం పాడాలంటే బీజేపీతోనే సాధ్యమని, ప్రధాని మోదీ ప్రేరణతో మల్లన్న బీజేపీలో చేరాలనుకుంటున్నారని ముత్తమ్మ లేఖలో పేర్కొన్నారు. జనవరిలో జరిగిన నల్గొండ-వరంగల్-ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పోటీలో బీజేపీ టికెట్ కోసం మల్లన్న ప్రయత్నించారని మల్లన్న భార్య ముత్తమ్మ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా కేసుల్లో ఇరికించి జైల్లో పెట్టిందని.. ఆయన్ను విడిపించాలని ఆమె కోరినట్లు తెలుస్తోంది. ఆయన సలహా మేరకే తాను మెయిల్స్ రాస్తున్నానని ఆమె పేర్కొన్నట్లు సమాచారం.

    ఓ జోతిష్యుడిని బెదిరించిన కేసులో జైలుపాలైన తీన్మార్ మల్లన్న బెయిల్‌పై విడుదలయ్యారు. ఆ వెంటనే మరో కేసులో ఆయనను రిమాండ్‌కి పంపించారు. మల్లన్న జైలుకెళ్లి ఇప్పటికి 34 రోజులు అవుతోంది. మల్లన్న భారతీయ జనతా పార్టీలోకి రావడంపై పార్టీ సీనియర్ నేతలు కూడా సానుకూలంగానే స్పందించారు. ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ తీన్మార్ మల్లన్న తమ పార్టీలోకి రాబోతున్నారని అన్నారు. మంచిరోజు చూసుకుని ఆయన పార్టీలోకి చేరబోతున్నారని.. తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీని ఓడించగలిగే సత్తా బీజేపీకి మాత్రమే ఉందని మల్లన్న నమ్మారని.. అందుకే బీజేపీలోకి చేరబోతున్నారని ఆయన వ్యాఖ్యలు చేశారు.

    Trending Stories

    Related Stories