Telugu States

ఈటల బృందానికి తప్పిన పెను ప్రమాదం..!

ఈటల రాజేందర్ భారతీయ జనతా పార్టీలో సోమవారం నాడు ఢిల్లీలో చేరిన సంగతి తెలిసిందే..! ఈరోజు ఢిల్లీ నుండి హైదరాబాద్ కు వస్తున్నారు ఈటల రాజేందర్. ఢిల్లీ నుండి ఈటల రాజేందర్ మరికొందరు వస్తున్న ప్రత్యేక విమానంలో సాంకేతిక సమస్య ఏర్పడినట్లు తెలుస్తోంది. పైలట్ అలర్ట్ అవ్వడంతో పెను ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది.

టేకాఫ్ సమయంలో రన్ వే పై విమానం ఉండగా పైలెట్ సాంకేతిక సమస్యను గుర్తించాడు. గాల్లోకి లేచే సమయంలో సమస్యను గుర్తించిన పైలట్ వెంటనే విమానాన్ని కిందకు దింపేశాడు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ఈటల బృందం బయల్దేరింది. సోమవారం ఢిల్లీలో ఈటల లాంఛనంగా బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ఈటల బృందం నేడు తిరిగి రాష్ట్రానికి ప్రత్యేక విమానంలో బయలుదేరారు. ఈ సమయంతో ఈ ఘటన జరిగింది. ఈటల రాజేందర్, ఎమ్మెల్యే రఘనందన్, వివేక్, ఏనుగు రవీందర్ రెడ్డి, తుల ఉమా తో పాటు విమానంలో మొత్తం 184 మంది ఉన్నట్లు తెలుస్తోంది.

ఢిల్లీలో పలువురు బీజేపీ నేతల సమక్షంలో ఈటల రాజేందర్ సోమవారం నాడు బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే..! భారతీయ జనతా పార్టీలో చేరడం సంతోషంగా ఉందని సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఈటల రాజేందర్ అన్నారు. చాలా సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమంలో పనిచేశానని, ప్రజలకు ఉద్యమంలో తన పాత్ర ఎంటో తెలుసని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ది రాచరిక ఫ్యూడల్ మనస్తత్వమని విమర్శించారు. తానొక్కడినే పాలిస్తే బాగుంటుందని భావించే వ్యక్తి కేసీఆర్ అని, ఏనాడూ ప్రజాస్వామ్య వేదికలను ఆయన గౌరవించలేదని ఈటల రాజేందర్ విమర్శించారు. 90 సీట్లు గెలిచి సంపూర్ణ మెజార్టీ వచ్చిన తర్వాత కూడా 3 నెలలు కేబినెట్ రూపొందించలేదని అన్నారు. రానున్న కాలంలో తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి బీజేపీలోకి చేరికలు కొనసాగుతాయన్నారు. రాబోయే కాలంలో తెలంగాణలో బీజేపీని మరింత విస్తరింపరింపజేసేలా నిరంతరం శ్రమిస్తామని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

18 − 15 =

Back to top button