More

    రెండో టీ20 మ్యాచ్ లో టీమిండియా ఘనవిజయం

    మౌంట్ మాంగనూయ్ లో న్యూజిలాండ్ తో జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో టీమిండియా ఘనవిజయం నమోదు చేసింది. న్యూజిలాండ్ ను 65 పరుగుల తేడాతో ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 191 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ 51 బంతుల్లోనే 111 పరుగులతో అజేయంగా నిలిచాడు. అనంతరం, 192 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన కివీస్ 18.5 ఓవర్లలో 126 పరుగులకే కుప్పకూలింది. దీపక్ హుడా 10 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ లో కెప్టెన్ కేన్ విలియమ్సన్ 61 పరుగులు చేశాడు. టీమిండియా బౌలర్లలో సిరాజ్, చహల్ రెండేసి వికెట్లు తీయగా, భువనేశ్వర్ కుమార్ 1, వాషింగ్టన్ సుందర్ 1 వికెట్ పడగొట్టారు. ఈ విజయంతో మూడు టీ20ల సిరీస్ లో భారత్ 1-0తో ముందంజ వేసింది. వర్షం కారణంగా తొలి టీ20 రద్దయింది. ఇరుజట్ల మధ్య చివరిదైన మూడో టీ20 నవంబరు 22న నేపియర్ లో జరగనుంది.

    Trending Stories

    Related Stories