More

    317 పరుగుల తేడాతో విజయం.. సరికొత్త చరిత్ర-సిరీస్ క్లీన్ స్వీప్

    శ్రీలంకతో జరిగిన మూడు వన్డేల సిరీస్ ను భారత్ క్లీన్ స్వీప్ చేసింది. తిరువనంతపురంలో శ్రీలంకతో జరిగిన చివరి వన్డేలో భారత్ 317 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. 391 పరుగుల లక్ష్యఛేదనలో శ్రీలంక 73 పరుగులకు కుప్పకూలింది. సిరాజ్ 4 వికెట్లు, షమీ 2, కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు తీశారు. లంక జట్టు కేవలం 22 ఓవర్లు మాత్రమే ఆడింది. ఆ జట్టులో ఓపెనర్ నువనిదు ఫెర్నాండో 19, కసున్ రజిత 13 (నాటౌట్), కెప్టెన్ దసున్ షనక 11 పరుగులు చేశారు. వన్డే చరిత్రలో ఇదే అతి పెద్ద విజయం. ఇప్పటివరకు ఈ రికార్డు న్యూజిలాండ్ పేరిట ఉంది. 2008లో ఐర్లాండ్ జట్టును న్యూజిలాండ్ 290 పరుగుల తేడాతో ఓడించింది. ఇప్పుడా రికార్డును భారతజట్టు సొంతం చేసుకుంది.

    ఇక ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ భారీ స్కోరు చేసింది. విరాట్ కోహ్లీ, శుభ్ మాన్ గిల్ సెంచరీలతో కదంతొక్కారు. దీంతో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 390 పరుగులు చేసింది. కోహ్లీ 110 బంతుల్లో 166 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కోహ్లీ ఇన్నింగ్స్ లో 13 ఫోర్లు, 8 భారీ సిక్సులు ఉన్నాయి. శుభ్ మాన్ గిల్ (116) కూడా సెంచరీ సాధించాడు. కోహ్లీకిది వన్డేల్లో 46వ సెంచరీ. ఈ మూడు వన్డేల సిరీస్ లో కోహ్లీ 2 సెంచరీలు చేశాడు. శ్రేయాస్ అయ్యర్ 38 పరుగులు చేశాడు. కేఎల్ రాహుల్ 7, సూర్యకుమార్ యాదవ్ 4 పరుగులకే అవుటయ్యారు. కెప్టెన్ రోహిత్ శర్మ 42 పరుగులు చేశాడు. లంక బౌలర్లలో కసున్ రజిత 2, లహిరు కుమార 2, చామిక కరుణరత్నే 1 వికెట్ తీశారు.

    Trending Stories

    Related Stories