వార్మప్ మ్యాచ్ లో విజయం సాధించిన భారత్

0
963

మొదటి వార్మప్ మ్యాచ్ లో భారత్ విజయం సాధించింది. తొలి వార్మప్ మ్యాచ్‌లో టీమిండియా 6 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది. చివరి ఓవర్‌లో విజయానికి 11 పరుగులు అవసరం కాగా, మహమ్మద్ షమీ 3 వికెట్లు తీసి భారత్‌కు విజయాన్ని అందించాడు.

టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. టీమ్ ఇండియా తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు కేఎల్ రాహుల్ నిలిచాడు. 33 బంతుల్లో 57 పరుగులు చేసి ఇన్నింగ్స్ ఆడాడు. అదే సమయంలో సూర్యకుమార్ యాదవ్ 33 బంతుల్లో 51 పరుగులతో ఇన్నింగ్స్ ఆడాడు. అతని స్ట్రైక్ రేట్ 151.51గా నిలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన భారతజట్టులో కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీలతో మెరిశారు. కోహ్లీ, రోహిత్ శర్మ, దినేష్ కార్తీక్ పర్వాలేదనిపించారు. రాహుల్ 33 బంతుల్లో 57 పరుగులు చేశాడ. అతడి ఇన్నింగ్స్ లో 3 సిక్సర్లు, 6 ఫోర్లు ఉన్నాయి. రోహిత్ శర్మ 14 బంతుల్లో 15 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. కోహ్లీ(19) పర్వాలేదనిపించాడు. హార్దిక్ పాండ్యా 2 పరుగులు చేసి విఫలమవ్వగా.. కార్తీక్ 14 బంతుల్లో 20 పరుగులు చేశాడు. భారత్ 20 ఓవర్లు ముగిసే సమయానికి 7 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా తరపున కేన్ రిచర్డ్‌సన్ 4 వికెట్లు పడగొట్టాడు.

ఆఖరి ఓవర్లో మొహమ్మద్ షమీ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో భారత్ విజయాన్ని అందుకుంది. ఆఖరి నాలుగు బంతులకు నాలుగు వికెట్లు పడడం విశేషం. అందులో ఒకటి రనౌట్ ఉండగా.. కమ్మిన్స్ ను కోహ్లీ అద్భుతమైన క్యాచ్ తో పెవిలియన్ చేర్చాడు. మిగిలిన వాటిలో రెండు అద్భుతమైన యార్కర్స్ వేయడంతో ఆసీస్ ఆలౌట్ అయింది.