తొలి వన్డేలో 300 పరుగులు దాటిన భారత్ స్కోరు

0
650

ఆక్లాండ్ వేదికగా న్యూజిలాండ్ తో జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్ లో భారత్ భారీ స్కోరు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 306 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్ (76 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 80) ఆఖరి వరకూ పోరాడగా.. ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ (16 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 37 నాటౌట్) చివర్లో మెరుపులు మెరిపించడంతో భారత స్కోరు 300 మార్కు దాటింది. ఈ మ్యాచ్ లో ఓపెనర్లు భారత్ కు శుభారంభాన్ని అందించారు. శిఖర్ ధవన్ (77 బంతుల్లో 13 ఫోర్లతో 72), శుభ్ మన్ గిల్ (65 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సర్లతో 50) అర్ధ సెంచరీలతో రాణించారు. తొలి వికెట్ కు 124 పరుగుల భాగస్వామ్యం అందించగా.. రిషబ్ పంత్, సూర్యకుమార్ విఫలమయ్యారు. పంత్ 23 బంతుల్లో కేవలం 15 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. సూర్యకుమార్ యాదవ్ నాలుగు పరుగులు మాత్రమే చేసి నిరాశ పరిచాడు. శ్రేయస్ అయ్యర్ సంజూ శాంసన్ (36)తో ఐదో వికెట్ కు 94 పరుగులు జోడించాడు. న్యూజిలాండ్ బౌలర్లలో టిమ్ సౌథీ, లోకీ ఫెర్గూసన్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు.