More

    రోహిత్, సూర్య, కోహ్లీ.. హాఫ్ సెంచరీల మోత

    టీ20 వరల్డ్ కప్ లో భాగంగా నెదర్లాండ్స్ పై భారత్ మంచి స్కోరు సాధించింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లకు 179 పరుగులు చేసింది. భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ 44 బంతుల్లో 62 పరుగులు చేశాడు. కోహ్లీ స్కోరులో 3 ఫోర్లు, 2 సిక్సులు ఉన్నాయి. సూర్యకుమార్ యాదవ్ కేవలం 25 బంతుల్లోనే 7 ఫోర్లు, 1 సిక్స్ తో 51 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఓపెనర్ కేఎల్ రాహుల్ (9) ఎల్బీడబ్ల్యూ రూపంలో వెనుదిరిగాడు. కెప్టెన్ రోహిత్ శర్మ 39 బంతుల్లో 53 పరుగులు చేసి ఇన్నింగ్స్ ను చక్కదిద్దాడు. రోహిత్ స్కోరులో 4 ఫోర్లు, 3 సిక్సులు ఉన్నాయి. రోహిత్ ఇచ్చిన క్యాచ్ లను అందుకోవడంలో నెదర్లాండ్స్ ఫీల్డర్లు విఫలమయ్యారు. నెదర్లాండ్స్ బౌలర్లలో వాన్ మీకెరెన్ 1, ఫ్రెడ్ క్లాసెన్ 1 వికెట్ తీశారు. పవర్ ప్లేలో కట్టుదిట్టంగా బౌలింగ్ వేసినా.. వికెట్లు తీయడంలో విఫలమైంది.

    Trending Stories

    Related Stories