More

    రోహిత్ శర్మ కెప్టెన్ గా.. టీమిండియా జట్టు ప్రకటన..!

    న్యూజిలాండ్ తో భారత్ లో జరిగే మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ కోసం రోహిత్ శర్మ నాయకత్వంలో భారత జట్టు బరిలో దిగనుంది. భారత టీ20 జట్టు సారథ్య బాధ్యతల నుంచి విరాట్ కోహ్లీ తప్పుకోవడంతో నూతన కెప్టెన్ గా రోహిత్ శర్మను నియమించారు. సెలెక్టర్లు 16 మందితో జట్టును ఎంపిక చేశారు. ఓపెనర్ కేఎల్ రాహుల్ ను వైస్ కెప్టెన్ గా నియమించారు. కోహ్లీ విశ్రాంతి పేరిట ఈ సిరీస్ నుంచి తప్పుకున్నట్టు తెలుస్తోంది. నవంబర్ 17, 19, 21 తేదీల్లో భారత్, న్యూజిలాండ్ మధ్య 3 టీ20 మ్యాచ్ లు జరగనున్నాయి. ఈ మ్యాచ్ లకు జైపూర్, రాంచీ, కోల్ కతా ఆతిథ్యమిస్తున్నాయి. ఈ సిరీస్ ముగియగానే రెండు టెస్టుల సిరీస్ జరగనుంది. ఐపీఎల్ లో రాణించిన ఆటగాళ్లపై బీసీసీఐ ప్రత్యేక దృష్టి పెట్టింది. వెంకటేశ్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్ లకు స్థానం కల్పించారు. బౌలింగ్ విభాగంలో హర్షల్ పటేల్ ను పరిశీలించనున్నారు. ఆర్సీబీ జట్టు తరఫున హర్షల్ ఐపీఎల్ లో విశేషంగా రాణించాడు. ఫామ్ లేకుండా ఇబ్బందులు పడుతున్న భువనేశ్వర్ కుమార్ కు సెలెక్టర్లు మరో అవకాశం ఇచ్చారు. ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యను సెలెక్టర్లు పక్కనబెట్టారు.

    టీ20 ప్రపంచకప్‌ నుంచి నిష్క్రమించిన తర్వాత భారత టీ20 కెప్టెన్సీ నుంచి కోహ్లి తప్పుకున్నాడు. సెలెక్టర్లు వెంకటేష్ అయ్యర్, అవేష్ ఖాన్, హర్షల్ పటేల్‌లకు కూడా తొలి అవకాశం ఇచ్చారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్‌లో ఈ ముగ్గురూ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. ఇక భారత టీ20 జట్టు ప్లేయింగ్ XIలో తమ స్థానాలను సుస్థిరం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వెంకటేష్ అయ్యర్ ఎంపికపై పలువురు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. 26 ఏళ్ల బ్యాటింగ్ ఆల్ రౌండర్ ఐపీఎల్ 2021లో 10 మ్యాచ్‌లు ఆడి 370 పరుగులు చేశాడు. మూడు వికెట్లు కూడా తీశాడు. ఇక రుతురాజ్ గైక్వాడ్ అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాడు.. అతడు నిలకడగా రాణిస్తూ ఉండడం కూడా విశేషం.

    భారత జట్టు
    రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, ఇషాన్ కిషన్, వెంకటేశ్ అయ్యర్, యజువేంద్ర చహల్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, ఆవేశ్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, దీపక్ చహర్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్.

    Trending Stories

    Related Stories