వైఎస్ఆర్సీపీ నేతలకు దమ్మూ ధైర్యం ఉంటే మూడు రాజధానుల అంశాన్ని రెఫరెండంగా తీసుకుని ఎన్నికలకు వెళ్లాలన్నారు టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యుడు అర్.శ్రీనివాసులరెడ్డి. రాయలసీమకు అన్యాయం చేసే విధంగా పరిపాలన రాజధానిని వైజాగ్‌కు తరలించాలని ప్రయత్నం చేస్తూ, రాయలసీమ అభివృద్ధి కోసం జాయింట్ యాక్షన్ కమిటీ వేస్తున్నట్లు ఎమ్మెల్యే గడికొట శ్రీకాంత్‌రెడ్డి చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. వైఎస్ఆర్సీపీ మూడు రాజధానుల అంశంపై అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు సిద్ధమైతే.. టీడీపీ అమరావతి రాజధాని నినాదంతో ఎన్నికలకు సిద్ధమని ప్రకటించారు. మూడు రాజధానుల పేరుతో వైఎస్.జగన్ మోసం చేస్తున్నారని ఆరోపించారు.