కాకినాడ: నర్సీపట్నంలో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అరెస్టును నిరసిస్తూ పిఠాపురంలో టిడిపి ఆందోళనకు దిగింది. మాజీ ఎమ్మెల్యే, టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎస్ కార్యాలయం నుండి ర్యాలీగా వచ్చి ధర్నా నిర్వహించారు. అక్రమంగా అరెస్ట్ చేసిన అయ్యన్నపాత్రుడిని వెంటనే విడుదల చేయాలని వర్మ డిమాండ్ చేశారు. కోటగుమ్మం సర్కిల్లో సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.