జగన్ సర్కార్ పన్నులపై పన్నులు వేస్తూ ప్రజల నడ్డి విరుస్తోందని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గోవర్ధన్‌రెడ్డి ఆరోపించారు. కడప నగరంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైసీపీ ప్రభుత్వాన్ని ఘాటుగా విమర్శించారు. ప్రస్తుత పరిస్థితుల్లో సామాన్య, మధ్య తరగతి కుటుంబాలు జీవనం సాగించడం కష్టసాధ్యమేనని అన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు ముట్టుకుంటే షాక్ కోట్టే పరిస్థితి ఉందన్నారు. ఇప్పటికే పన్నుల భారంతో సతమవుతున్న ప్రజలపై చెత్త పన్ను భారాన్ని మోపడం తగదన్నారు. ఓ వైపు సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే మరోవైపు రెండింతలు పన్నుల రూపంలో వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజల బాగోగుల కన్నా నేతలకు లబ్ధి చేకూర్చడమే వైఎస్.జగన్ లక్ష్యంగా పెట్టుకున్నారని నిప్పులు చెరిగారు. శాండ్, లిక్కర్, మైనింగ్ అక్రమాలకు తెరలేపి అందినకాడికి దోచుకుంటున్నారని ఆరోపించారు.