More

    అనపర్తిలో టీడీపీ వినూత్న నిరసన

    తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో రోడ్లు పూర్తిస్థాయిలో శిథిలమైన ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణరెడ్డికి ఏమాత్రం చలనం లేదని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే పేరుతో సూర్యనారాయణరెడ్డి గుంతల పథకం అంటూ వినుత్న రీతిలో నిరసన తెలిపారు. రోడ్లపై ఏర్పడిన గుంతలలో పడవలు వదిలారు. సామర్లకోట ధవలేశ్వరం కెనాల్ రోడ్డు పూర్తిస్థాయిలో శిథిలమై పెద్ద పెద్ద గుంటలు పడి అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాణ్యత లేకుండా చేపట్టిన రోడ్లు మరమ్మత్తులపై ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణరెడ్డి ఎందుకు మాట్లాడటం లేదంటూ ఈ సందర్భంగా రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. 2వేల కోట్ల రూపాయలతో రోడ్లు నిర్మిస్తామని సీఎం జగన్మోహన్‎రెడ్డి చెప్పుకుంటూ పోతున్నారే తప్ప ఏ ఒక్క రోడ్డును నిర్మించలేదని ఆయన ఎద్దేవా చేశారు. తక్షణమే రోడ్డు నిర్మాణాన్ని చేపట్టాలని, లేకపోత నిరసనలను తీవ్రతరం చేస్తానని హెచ్చరించారు.

    Trending Stories

    Related Stories