బైక్ ర్యాలీని ప్లాన్ చేసిన టీడీపీ

0
876

ఈ ఏడాది మహానాడును ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని టీడీపీ శ్రేణులు ప్రయత్నిస్తూ ఉన్నాయి. ఒంగోలులో ఈనెల 27, 28 తేదీల్లో మహానాడును ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఒంగోలుకు వెళ్తున్నారు. మూడు రోజుల పాటు ఆయన అక్కడే ఉండనున్నారు. ఒంగోలుకు చంద్రబాబు పర్యటన సందర్భంగా విజయవాడ నుంచి ఒంగోలు వరకు టీడీపీ శ్రేణులు బైక్ ర్యాలీ నిర్వహించనున్నాయి. ఈ బైక్ ర్యాలీకి ప్రకాశం జిల్లా సరిహద్దు మార్టూరు వద్ద టీడీపీ శ్రేణులు స్వాగత ఏర్పాట్లు చేశాయి. మధ్యాహ్నం 3 గంటలకు చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం జరగనుంది. మహానాడులో చర్చించే కీలక అంశాలపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.